తాతయ్య ఉదయం నాలుగు గంటలకే చికెన్ తినమనేవారు

Nara Brahmini interview with media on Women's day

11:56 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Nara Brahmini interview with media on Women's day

ఇటీవలే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కి సంబంధించి మీడియా ముందుకొచ్చిన నందమూరి బాలకృష్ణ ముద్దుల కూతురు బ్రాహ్మణి తాజాగా మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మరోసారి మీడియా ముందుకొచ్చింది. బ్రాహ్మణితో ఇంటర్వ్యూ జరిపిన మీడియా ముందు తమ కుటుంబం గురించి వివరించింది. అసలు బ్రాహ్మణి ఏమందో తన మాటల్లోనే చూడండి. చిన్నప్పుడు తాతయ్య గారితో చాలా స్నేహంగా ఉండేదాన్ని, ఆయన ఉదయాన్నే నాలుగింటికి నిద్ర లేచేవారు. అంతేకాదు తాతగారు ఉదయాన్నే నాలుగింటికే మమ్మల్ని చికెన్‌ తినమనేవారు. చిన్నప్పుడు తాతయ్యతో కలిసి ఎక్కువ చికెన్‌ తిన్నా.

మా కుటుంబం మొత్తం తాతయ్యతో ఎక్కువ సమయం గడిపే వాళ్లం. ఇకపోతే అత్తారిల్లు, అత్తయ్య-మావయ్యతో బాగా సన్నిహితంగా ఉంటా. అవ్వడానికి అత్తవారి ఇల్లే కానీ ఈ ఇంట్లో చాలా స్వేచ్ఛగా ఉంటా, మా అమ్మగారింట్లో ఉన్నట్లే ఉంటుంది. అత్తయ్య నాకెప్పుడూ సపోర్టే నాకు సలహాలు కూడా ఇస్తారు. అత్తమ్మ రోజూ ప్రొద్దున్నే నాలుగు గంటలకి నిద్ర లేచి వ్యాయామాలు చేసి ఇంటి పనులన్నీ చక్కబెడతారు. అత్తగారింట్లో ఉదయాన్నే మేమందరం లేచి వ్యాయామాలు చేస్తాం. ఆ తరువాత మా బాబు దేవాన్ష్‌ తో కాసేపు గడుపుతాం, ఇంక ఆ తరువాత ఇంటి పనులు చక్కబెడతాం.

రోజూ మా ఇంట్లో ఉదయం ఆరింటికి దినచర్య మొదలై రాత్రి 10 గంటలకి పూర్తవుతుంది. దేవాన్ష్‌ను చూస్తే మా నాన్నగారు చిన్న పిల్లాడైపోతారు. అందుకే ఆయనకు 'గోలతాత' అని పేరు పెట్టాం. నాన్నని అర్ధం చేసుకుంటే వారికి ఏమైనా చెయ్యడానికి వెనుకాడరు. అదే ఆయనని అర్ధం చేసుకోని వాళ్లకి ఆయన చాలా ఇబ్బందిగా ఉంటారు. అని తమ కుటుంబం గురించి చెప్పుకొచ్చింది.

English summary

Nara Brahmini interview with media on Women's day. She talked about her family members and daily logs.