దేవాన్ష్ ఫస్ట్ బర్త్ డే అదిరిపోవాల్సిందే... 

Nara Chandrababu Naidu grand son Devansh birthday celebrations

06:44 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Nara Chandrababu Naidu grand son Devansh birthday celebrations

ఓ పక్క ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మరో పక్క నటసింహం-హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌... ఈ ఇద్దరు తాతల ముద్దుల మనవడు... ఇక ఏదైనా సరే అదిరిపోవాల్సిందేగా.... అందుకే ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఆ ఇంట సందడే సందడి... ఆ మధ్య నారావారి పల్లె లో వీరి ముద్దుల మనవడు దేవాన్ష్ పుట్టి వెంట్రుకలు తీసే కార్యక్రమానికి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు... ఇక ఇప్పుడు కీలకమైన ఫస్ట్ బర్త్ డే కూడా రానే వస్తోంది... అందుకే గ్రాండ్ గా చేయడానికి నిర్ణయించారు. రాజు తలచుకుంటే కొదవా... అందుకే ముద్దుల మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ బర్త్ డే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పైగా ఈ ఫంక్షన్‌ను తాజ్ కృష్ణలో నిర్వహించనున్నారు.

నారా ఇంట మూడో తరం తొలి వారసుడు కావడంతో మార్చి 21న తొలి పుట్టినరోజు గ్రాండ్‌గా చేయాలని భావించిన దేవాన్ష్ తండ్రి టిడిపి నేత చినబాబు నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహించాబోతున్నాడు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక సిద్ధం చేసారు. రకరకాల డిజైన్లతో దీన్ని రూపొందించారు. ఈ ఆహ్వాన ప‌త్రిక చూస్తే క‌ళ్లు జిగేల్‌మ‌నేలా అదిరిపోయే రేంజ్‌లో ఉంది. ఈ ఫొటో చూస్తే బాబు గారి మ‌న‌వ‌డా మ‌జాకా అనుకోవాల్సిందే. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇదంతా ఓ ఎత్తైతే, మరోపక్క బర్త్‌డే సందర్భంగా దేవాన్ష్‌కు సంబంధించి రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

లోకేష్‌-బ్రాహ్మ‌ణికి 2007లో వివాహ‌మైనప్పటికి గ‌తేడాదే వీరికి బాబు పుట్టాడు. ప్ర‌స్తుతం లోకేష్ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. బ్రాహ్మ‌ణి కూడా హెరిటేజ్ సంస్థను విజ‌య‌వంతంగా నడిపిస్తోంది. ఇక రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు వివిఐపిలకు దేవాన్ష్ ని పరిచయం చేస్తూ, ప్రముఖుడిగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తూ, మరోపక్క ముద్దూ ముచ్చట ఎప్పటికప్పుడు తీరుస్తున్నారు.

English summary

Nara Chandrababu Naidu grand son Devansh birthday celebrations. Balakrishna Grand son Devansh 1st birthday celebrations.