దేవాన్ష్ బర్త్ డే ...  వహ్ తాజ్ ...

Nara Devansh Birthday Celebrations

12:28 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Nara Devansh Birthday Celebrations

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌ తొలి పుట్టిన రోజు వేడుక సోమవారం ఘనంగా జరిగింది. తొలి జన్మదినం సందర్భంగా దేవాన్ష్‌కు పసుపు చొక్కా వేసి కుటుంబ సభ్యులు సరదాగా సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను లోకేష్ తన ట్విట్టర్‌లో పెట్టారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్,  బ్రహ్మణి దంపతులు ఈ ఫొటోలో ఉన్నారు. సోమవారం సాయంత్రం తాజ్‌ కృష్ణా హోటల్‌లో బంధువులు, స్నేహితుల సమక్షంలో దేవాన్ష్‌ జన్మదిన వేడుకలు జరిగాయి.

దీనికి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు... సినీ హీరో బాలకృష్ణ కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ నేతలు, అధికారులను మాత్రం ఆహ్వానించలేదు. చంద్రబాబు, బాలకృష్ణల స్వగ్రామాలు నారావారిపల్లి, నిమ్మకూరు నుంచి కూడా బంధువులు హాజరయ్యారు. సినీ రంగంలో కూడా లోకేష్ దంపతులకు బాగా సన్నిహితంగా ఉండే, మంచు లక్ష్మి, హీరో రాంచరణ్‌ సతీమణి ఉపాసన తదితరులు వచ్చారు.  సుమారు వెయ్యి మంది మధ్య జరిగిన ఈ వేడుకలో చిన్న పిల్లల కోసం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, దేవాన్ష్‌ తొలి పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళమిచ్చినట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. గత వార్షిక బ్రహ్మోత్సవాలలో కూడా గరుడసేవ రోజున అన్నప్రసాద వితరణకయ్యే ఖర్చును ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడి పేరిట రూ.20లక్షలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

నారా చంద్రబాబు , బాలకృష్ణ ల ముద్దుల మనువడు దేవాన్ష్ పుట్టిన రోజు ఫోటోలు స్లైడ్ షోలో చుడండి....

కొడుకు ఫోటోని నెట్లో పెట్టిన సమంత

మాట తప్పిన నాగ్‌

ఇంతకీ ఆమె ఎవరి భార్య ..

ఆయనకి భయపడి 'బ్రహ్మోత్సవం' వాయిదా వేసిన మహేష్

1/8 Pages

తాతయ్య ట్వీట్

 చంద్రబాబు ట్విట్టర్‌లో దేవాన్ష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నారా దేవాన్ష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు మాకు సంతోషాన్ని తెచ్చావు. భగవంతుడు నిన్ను మంచి జీవితంతో... విజయాలతో ఆశీర్వదించాలని నా ఆకాంక్ష’ అని ఆయన పేర్కొన్నారు.

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu and Hindupuram MLA and Hero Nandamuri Balakrishna's Grand Son Nara Devansh completes one year and that function was conducted in a grand way.Nara Chandra Babu Naidu Tweeted and wish his Grandson Devansh on Twitter.