నందమూరి కన్నా నారా స్మరణే మేలట

Nara is better than Nandamuri

05:50 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Nara is better than Nandamuri

ఇప్పుడు టీడీపీలో సరికొత్త పల్లవి అందుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నెలకొల్పిన టీడీపీ కాలక్రమంలో చంద్రబాబు సారధ్యంలోకి వచ్చేసింది. నందమూరి టూ నారా కు చేరిన టీడీపీలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆ మధ్య వినిపించడంతో నందమూరి అభిమానుల్లో ఒకింత సందడి కనిపించింది. ఆ తరవాత పరిణామాల్లో జూనియర్ పక్కకు పోయాడు. కొంతమందైతే పక్కకు పోయేలా చేసారని అంటుంటారు. టీడీపీ పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడంతో ఇక నారా వారి వారసుడు లోకేష్ హల్ చల్ చేస్తున్నట్లు అందరికీ తెల్సిందే. ఇక లోకేష్ కుమారుడు దేవాన్ష్ ని కూడా వార్తల్లోకి ఎక్కించారు.

విదేశీ ప్రముఖులకు సైతం దేవాన్ష్ ని పరిచయం చేయడం, వాళ్ళు ముద్దాడడం కూడా తెల్సిందే. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం పై కూడా దేవాన్ష్ దర్శనమిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరపడం మొదటి నుంచీ వస్తోంది. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ జయంతికి మహానాడు జరపడానికి ఏర్పాట్లు చేసారు. విషయం ఏమంటే, కొన్ని ప్రాంతాల ఫ్లేక్సీలలో దేవాన్ష్ ఫోటో కూడా దర్శనమిస్తోంది. ఇది చూసిన వాళ్ళు నందమూరి జపం కన్నా నారా జపమే ముద్దునే తాతలు వుందని, చిన్న పిల్లాడిని, అది కూడా ఏడాది నిండిన పిల్లాడి ఫోటో రాజకీయంగా వాడడం ఎలా అర్ధం చేసుకోవాలని పలువురు వాపోతున్నారు. మొత్తానికి చంద్రబాబు ప్రభావం మనవడి దాకా పాకింది.

English summary

Nara is better than Nandamuri