కారు బ్యాచ్ పై సైకిల్ బాబు ట్వీట్

Nara Lokesh Fires On TRS On Twitter

09:44 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Nara Lokesh Fires On TRS On Twitter

టిఆర్ఎస్ పై మాటల యుద్ధానికి తెరలేపిన లోకేష్

గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్ధం సాగనుంది. ఆ మధ్య ఎడ ముఖం , పెడ ముఖం గా ఉంటూ , ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా. ఆతర్వాత పరిణామాల్లో ఆత్మీయ ఆహ్వానాలు.. ఒకరింటికి మరొకరు వెళ్లటం, కుశల ప్రశ్నలు, ముచ్చట గొలిపే కబుర్లు, కొసరి వడ్దించే విందు, తదితర సంఘటలతో ఇద్దరు చంద్రుళ్ల మధ్య సామరస్య ధోరణి సాగుతోంది. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సైరన్ మోగడంతో మళ్ళీ పూర్వపు పరిస్థితి రాజ్యమేలే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నిన్నటిదాకా రెండు రాష్ట్రాల మధ్య కూల్ గా వున్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనుంది. రెండు రాష్ట్రాల అధికార పార్టీ నేతల నడుమ సాగిన సామరస్య ధోరణి, దీనికితోడు అనుచర గణాలు కూడా ఆచితూచి మాట్లాడుకునే స్థితి ఇప్పుడు కత్తులు దూసుకునే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితికి దారితీయనుంది.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి టీడీపీ జాతీయ కార్యదర్శి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబే తెరలేపారు. వివరాల్లోకి వెళితే, తాజాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ, ఆదివారం ఉదయం .ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.టీఆర్ఎస్ ది ద్వంద విధానమని చినబాబు ఆరోపిస్తూ,. సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు..గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్ల కోసం వారు చేస్తున్న సానుకూల వ్యాఖ్యలు మొసలి కన్నీరు కార్చటం గా వుందని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక విమర్శలు - ప్రతి విమర్శలు, ఒకరి నొకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఓ పార్టీ జాతకం మరో పార్టీ బహిర్గతం చేయడం షరా మామూలే. అయినా ఎన్నికలన్నాక ఆమాత్రం ఉండకపోతే మజా వుండదు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary

Chandra Babu Naidu's son Nara lokesh fires on TRS party because of the policies which were taking by TRS in GHMC elections.