లోకేష్ నోట మీడియా ఛానెల్ మాట

Nara Lokesh Talking About Media Channel

11:20 AM ON 28th April, 2016 By Mirchi Vilas

Nara Lokesh Talking About Media Channel

టివి 9 రవిప్రకాష్ తో కల్సి ఓ టివి చానల్ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు - టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు షికారు చేసాయి. అయితే మరోమారు మీడియా సంస్థల గురించి లోకేష్ ప్రస్తావించాడు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం లోకేష్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ సొంత మనవడు దేవాన్ష్ తో కాసేపు గడపలేనంత బిజీగా తన తండ్రి - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బీజీ జీవితాన్నిగడుపుతున్నారని చెప్పారు."రాష్ట్రాభివృద్ధి కోసం పగలు - రాత్రులు కుర్రాడిలా ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు. రోజుకు 18 గంటలు మీటింగుల్లోనే బిజీ. 65 ఏళ్ళ వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయనే మనకందరికీ స్ఫూర్తి” అని లోకేష్ వివరించారు.

ఇవి కూడా చదవండి:మరో దఫా 'పనామా పేపర్స్' మహా రిలీజ్

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావిస్తూ బలమైన కార్యకర్తలే పార్టీ సత్తా అని తేల్చిచెప్పారు. “టీడీపీకి సొంతంగా ఎలాంటి ఛానెళ్ళూ - పత్రికలూ లేవు. అయితే పార్టీ కోసమే పనిచేసే 54 లక్షల కార్యకర్తల బలం ఉంది. అంతకు మించిన ప్రజాదీవెన ఉంది. అందుకే ప్రజా వ్యతిరేక వార్తలు రాసే కొన్ని మీడియా సంస్థల విషయంలో గందరగోళం చెందవద్దు. పార్టీ కార్యకర్తలు అసలు విషయాలను వారికి వివరించాలి” అని లోకేష్ సూచించారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న లోకేష్ ప్రతీ జిల్లాపై పట్టు పెంచుకుంటున్నారు. టీడీపీ - వైఎస్ ఆర్ సీపీ కేడర్ ల బలాబలాలను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో సమావేశం అవడం వారి సాదక - బాధకాలను ఓపికగా వింటున్నారు. దీంతో పాటు పార్టీలో కొత్తగా చేరే నేతలతో సమన్వయం చేసుకునే విషయంలో తెలుగు తమ్ముళ్లతో చర్చిస్తున్నారు. అభివృద్ధిలో అంతా కలిసి ముందుకు వెళ్లాలంటూ హితబోధ చేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు పరిపాలనపై దృష్టి సారిస్తే... లోకేష్ పార్టీ వర్గాలతో మమేకం అవుతున్నాడని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇది భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా నిలుస్తోందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:గూగుల్, ఫేస్‌బుక్‌ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:విమానం టాయ్‌లెట్‌లో 7కేజీల బంగారం!!

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu Son Nara Lokesh was attended to TDP office opening ceremony in Vishakapatnam.He said that Telugu Desham Party have no new channel but some news channels are publishing wrong information about TDP.