తదుపరి సిఎమ్ నారా లోకేష్?

Nara Lokesh Will Become CM In 2019 Elections

10:57 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Nara Lokesh Will Become CM In 2019 Elections

అవునా అంటే అవుననే అంటున్నారు ఓ జ్యోతిష్యుడు. ఇప్పటికే నారా లోకేష్ ని మంత్రి పదవిలో కూర్చో బెట్టాలనే డిమాండ్ బలంగానే వస్తోంది కూడా. తదుపరి సిఎమ్ లోకేష్ కావడం ఖాయమనే మాట కూడా టిడిపి శ్రేణుల నుంచే వినిపిస్తోంది. ఇక తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ లోకేష్ కాబోయే సిఎమ్ అని గట్టిగా చెబుతున్నారు. "ఇది నామాట. నామాటే వేదవాక్కు. నా మాట తప్పిన సందర్భంలేదు. గతాన్ని తరచి చూసుకోండి.. నేను చెప్పిన వన్నీ జరిగిపోయాయి. భవిష్యత్తూ అంతే. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాలోకేష్" అంటూ ఆయన కుండబద్దలు కొడుతున్నారు. గ్రహబలం, వాస్తురీత్యా ఇది ముమ్మాటికీ నిజమౌతుందంటున్నారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన సుబ్రహ్మణ్యస్వామి, రాజకీయ పార్టీల అధినేతల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని చెప్పానని, అలాగే, 2014లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో తాను ముందు చెప్పినట్టు గానే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీనే గెలుస్తుందని, అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి: మళ్లీ సైజ్‌జీరోకి అనుష్క

ఇవి కూడా చదవండి:అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

ఇవి కూడా చదవండి:'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

English summary

Sri Raja Rajeswari Jyothishyalam Founder Sri Subrahmanya Swamy said that Nara Lokesh will become Chief Minister in 2019 Elections and Jaya Lalitha will Become CM in 2016 Elections In Tamilnadu.