కొలవరిడీ టైపులో నారా రోహిత్‌ పాట

Nara Rohit Sings Song in Savithri Movie

11:36 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Nara Rohit Sings Song in Savithri Movie

నారా వారాబ్బాయి నారా రోహిత్‌ వరుస పెట్టి తొమ్మిది సినిమాల్లో నటిస్తూ ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. నారా రోహిత్‌ నటిస్తున్న తొమ్మిది సినిమాల్లో 'సావిత్రి' ఒకటి. ఈ చిత్రంలో రోహిత్‌-నందిత జంటగా నటిస్తున్నారు. డాక్టర్‌ విబి రాజేంద్ర ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవల మన తెలుగు హీరోలు తమ సినిమాల్లో ఏదో ఒక పాట పాడుతూ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నారా రోహిత్‌ కూడా వచ్చి చేరాడు. ఈ చిత్రంలో ఒక ఫాస్ట్‌ బీట్‌ సాంగ్‌ శ్రావణ్‌ రోహిత్‌ చేత పాట పాడించాడు. సావిత్రి పాత్రను చూసి 'వాట్‌ డు యు సే సావిత్రి' అనే పాటను రోహిత్‌ సినిమాలో పాడతాడు. అదే పాటను రోహిత్‌ తోనే పాడించారు. మొదటిసారైనా అద్భుతంగా పాడడంతో ప్రస్తుతం ఈ పాట నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది.

English summary

Young Hero Nara Rohit was presently busy in acting with his movies and his latest movie Savithri movie going to release soon.In this movie Nara Rohit himself sing a song Named "What Do You Say Savithri" song .This movie was directed by Pavan Sadineni,Music composed by Shravan.