తుంటరి.. పక్కా మాస్ అవతార్.. 

Nara Rohit Tuntari Audio Launched

10:22 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Nara Rohit Tuntari Audio Launched

నారా రోహిత్... విభిన్న కథా చిత్రాలు.. ప్రయోగాలకు పెట్టింది పేరు. దాదాపు నారా రోహిత్ ప్రతి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఈ లోటును తీర్చుకునేందుకు పక్కా మాస్ అవతారం ఎత్తాడు. ఇంతకు ముందు కాస్త ఒళ్లు చేసి బొద్దుగా కనిపించిన వాడు కాస్తా.. సిక్స్ ప్యాక్ చేసి బాక్సాఫీస్ పై దండయాత్రకు వస్తున్నాడు. నారా రోహిత్ నటించిన కొత్త సినిమా తుంటరి. తమిళ సూపర్ హిట్ మూవీ మాన్ కరాటే చిత్రానికి రీమేక్ ఇది. గుండెల్లో గోదారి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కథను అందించింది తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. తాజాగా ఈ మూవీ ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రోహిత్ ఫుల్ మాస్ రోల్ లో అదరగొట్టేయనున్నాడని.. ట్రైలర్ లో చూస్తేనే అర్థమైపోయింది. ఊర మాస్ డైలాగులతో పిచ్చెక్కించేశాడు. హీరోయిన్ లతా హెగ్డే.. విలన్ కబీర్ దుహన్ సింగ్ కూడా బాగానే జనానికి ట్రైలర్ తోనే రిజిస్టర్ అయిపోయారు. మంచి సినిమాలు చేసిన హీరోగా గుర్తింపు సాధించిన రోహిత్ నటించిన ఈ సినిమాపై చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Nara Rohith was fasmous for his different roles in his Movies.Nara Rohith Upcoming Movie Tuntari movie audio was released yesterday.This film was directed by kumar Nagendra and Lata Hedge acted as heroine in this movie.This was the remake of Tamil Super hit film Maan Karate