దాసాంజనేయస్వామి కి నారా రోహిత్ పూజలు 

Nara Rohit Visits Dasaanjaneya Temple

12:36 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Nara Rohit Visits Dasaanjaneya Temple

కృష్ణా జిల్లా మాచవరం దాసాంజనేయస్వామి ఆలయంలో సినీ హీరో నారా రోహిత్ పూజలు నిర్వహించుకున్న్నారు. పశ్చిమగోదావరి జిల్లా బీమవరంలో సినిమాషూటింగ్‌కు వెళుతూ మద్యలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ఈఓ నూతక్కి సాంబశివరావు,ఐదవ డివిజన కార్పోరేటర్‌ కంచర్ల నాగశేషారాణి,ఒకటవ డివిజన కార్పోరేటర్‌ పిన్నమనేని శివరంజనీ,అర్బన తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి గన్నే వెంకటనారాయణ(అన్నా)లు నారారోహిత్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షుడు వల్లభనేని సతీష్‌,కార్పోరేటర్‌ కోసూరి శైలజ,విజయకృష్ణ సూపర్‌ మార్కెట్‌ చైర్మన గొట్టుముక్కల రఘు,నారా రోహిత రాష్ట్ర ఫ్యాన్స నాయకులు టి.సాయికృష్ణ,వీరపనేని శివ పాల్గొన్నారు. పూజల అనంతరం హీరో రోహిత్ ను శాలువాతో ఆలయ ఈఓ నూతక్కి సాంబశివరావు సత్కరించారు. ఈ సందర్బంగా రోహిత్ మీడియాతో మాత్లాదారు... 'కృష్ణాజిల్లాతో నాకు అనుబందం వుంది. ...అందుకే బీమవరంలో షూటింగ్‌ ఉన్నప్పటికీ విజయవాడలో ఆగి పూజలు చేయించుకుంటున్నా.ప్రేక్షక దేవుళ్ళ ఆశిస్సులతో తాను ఈస్థాయికి ఎదిగా. రాబోయే రోజుల్లో నాసినిమాలు అందరినీ మరింతరగా ఆకట్టుకునేలా వుంటాయి. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణతో నాలో మరింత ఉత్సాహం వస్తుంది'అని రోహిత్ వివరించారు.

English summary

Tollywood Hero Nara Rohith Visits Sri Daasanjaneya temple in Krishna District. He is going to his shooting spot in bhimavaram , west godavari district on the way to his shooting he stopped there and prays to god