నరక చతుర్థశి అని ఎందుకు అంటారో తెలుసా?

Naraka Chaturdashi enduku antaro telusa

10:32 AM ON 25th October, 2016 By Mirchi Vilas

Naraka Chaturdashi enduku antaro telusa

తెలుగు నెలల్లో ప్రతినెలా రెండు సార్లు చతుర్ధశి వస్తుంది. ఇందులో అమావాస్య ముందు వచ్చే చతుర్ధశికి విశిష్టత ఉంటుంది. మాస శివరాత్రి అని కూడా అంటారు. అయితే ఆశ్వయుజ బహుళ చతుర్ధశి అనగానే నరక చతుర్ధశి అనేమాట గుర్తొస్తుంది. పైగా దీపావళి(అమావాస్య) పండుగ ముందు రోజు నరక చతుర్థి వస్తుంది. అసలు ఎందుకు ఇలా వచ్చిందో ఓ సారి తెలుసుకుందాం..
పూర్వం నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కల్గించేవాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు.

అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

1/4 Pages

అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు తరలి వెళ్తాడు. అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణిస్తాడు.

English summary

Naraka Chaturdashi enduku antaro telusa