తండ్రి గురించి బ్రహ్మణి షాకింగ్ కామెంట్స్

Naran Brahmani Comments On Balakrishna

10:37 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Naran Brahmani Comments On Balakrishna

తన తండ్రి గురించి ఎప్పుడూ ఏదోక తమాషా సంగతి చెప్పే బ్రహ్మణి, బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా మరో ఆసక్తికర కామెంట్ చేసింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్ లో వేడుకలు నిర్వహించారు. బాలయ్య అమెరికాలో ఉండడంతో జరిగిన ఈ వేడుకలకు గౌతమీ పుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ 'సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుంది. కాననీ నాన్నకు వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువవుతోంది. మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటారు. నాన్న 57ఏళ్ల వయసులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. 'నాన్నగారు చిన్నప్పటి నుంచి మానవసేవే మాధవ సేవ అని చెబుతూ వస్తున్నారు. ఆస్ఫూర్తి తాతగారి దగ్గర నుంచి వచ్చింది" అని చెప్పింది.

ఇవి కూడా చదవండి:'అంతా పేరెంట్స్ చేసారు' మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:'ఒక్క అమ్మాయి తప్ప' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Cinema Hero, Politician Nandamuri Balakrishna 57th Birthday Celebrations were held grandly in Basavatarakam cancer hospital and she says that Balakrishna was growing young with his age.