మనల్ని ప్రపంచం సరిగా అర్థం చేసుకోలేదన్న మోడీ

Narandra Modi Speaks About India

10:04 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Narandra Modi Speaks About India

‘ ఏనాడూ ఒంటెత్తు పోకడను అనుసరించని దేశం భారత్. మతాన్ని గానీ, మతతత్వాన్ని గానీ ప్రపంచానికి ఇవ్వని దేశమిది. విభజన ప్రయత్నాలను ఎన్నడూ చేయని దేశం మనదే. మతతత్వాన్ని ఈ గడ్డ ఎన్నడూ ఇవ్వలేదు. కానీ ఈ ప్రపంచం మనల్ని అర్థం చేసుకోవాల్సిన విధానంలో అర్థం చేసుకోలేకపోయింది. సమాజమే ఒక్కోసారి సమస్యలకు హేతువు అవుతూ వుంటుంది. అలాంటి సమస్యలకు ఆధ్యాత్మికత పరిష్కారాన్ని చూపిస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

‘మై ఇండియా... నోబెల్‌ ఇండియా’ పేరుతో ప్రముఖ జైన సన్యాసి ఆచార్య రత్నసుందర్‌ సూరీశ్వర్‌ మహరాజ్‌ నాలుగు భాషల్లో రచించిన 300వ పుస్తకాన్ని ఆదివారం మోదీ ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానం ద్వారా ఆవిష్కరించారు. ఇది తనకు లభించిన సువర్ణావకాశామని చెప్పారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సవాళ్లకు భారత ఆధ్యాత్మిక వారసత్వమే పరిష్కారాలు చూపిస్తుందంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పేవారని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మికతను అందించిందే గానీ మతతత్వాన్ని కాదని మోడీ స్పష్టంచేశారు. రుషులు, మునులు ‘రాష్ట్ర ధర్మా’నికే (జాతి పట్ల ధర్మానికే) కట్టుబడి ఉండేవారనీ, అది అన్ని మతాల కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు.

అన్ని మతాల కంటే ‘జాతీయ మతం’ మిన్న అని మోడీ పేర్కొన్నారు. రత్నసుందర్‌ సూరి మహరాజ్‌ను గొప్ప సాంఘిక సంస్కర్తగా, ఆధ్యాత్మిక గురువుగా ఆయన అభివర్ణించారు. అనేక ప్రాపంచిక విషయాలను తన పుస్తకాల ద్వారా చాటిచెబుతూ వచ్చిన ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ‘రత్న సుందర్‌ గొప్ప రచయితే కాకుండా మంచి శ్రోత కూడా. ఆయన వెలువరించిన పుస్తకాలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు... గంగ వంటి పవిత్ర నదిలో మన ఆత్మను, దేహాన్ని శుద్ధి చేసుకునేందుకు ఇవి మార్గం చూపిస్తాయి. మన దేశ సాంస్కృతిక వైశిష్ఠ్యం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తుంది' అని ప్రధాని చెప్పారు. రత్నసుందర్‌ రచనల్లో వెన్నెలంత చల్లదనం, ప్రశాంతత తో పాటూ దురాచారాలపై తీవ్రమైన చురకలూ ఉంటాయని మోడీ విశ్లేషించారు.

English summary

India Prime Minister Narendra Modi Speaks about India In Delhi in An event,he says that India is a very tolerant country and India is the country of togetherness