ఆనాడు ఏపీకి మట్టి ... నేడు తెలంగాణకు చెంబు .. ..

Narandra Modi To Visit Telangana For The First Time

10:50 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Narandra Modi To Visit Telangana For The First Time

ఫస్ట్ టైమ్ ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఈనెల 7న తెలంగాణకు రాబోతున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరధ పథకం ఆయన ప్రారంభించనున్నారు. మిషన్ భగీరధతోపాటు మరికొన్ని పనులప్రారంభోత్సవాలు, పైలాన్లు వంటివి చేపడతారు. ఇంతవరకు బానే వుంది.. ప్రధాని తొలిసారి కొత్తగా ఆవిర్భవించిన రాష్ర్టానికి వస్తున్నారంటే ఎంతోకొంత మేలు జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు తాయిళాలు ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

ఇంతవరకు బానేవుంది.. కొత్త తెలుగు రాష్ర్టాల రాజకీయ నాయకులు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు రాగి చెంబుతో మట్టి తీసుకొచ్చారని, ఇప్పుడు తెలంగాణ మిషన్ భగీరధ కావడంతో గంగానది నుంచి నీటితో ఓ చెంబుని తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ నాయకులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. రెండురోజుల కిందట ప్రధాని అనుచరులు ఓ రాగి చెంబును కోనుగోలు చేసినట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి తెలుగు రాష్ర్టాలకు చెంబులతో మట్టి-నీళ్లతో సరిపెడుతున్నారన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:కాజల్ ఇలా హడలు గొడుతూ రివేంజ్ తీర్చుకుంటోందా ?

ఇవి కూడా చదవండి:మగాళ్ళంటే ఎలర్జీ గల ఊరుందని తెలుసా?

English summary

Prime Minister of India Narendra Modi to Visit Telangana State for the first time after he become Prime Minister to India. He was going to start Telangana Government's Mission Bhagiradha works in Telagana.