నరసరావుపేట పురపాలక శతాబ్ది వేడుకలు ఆరంభం 

Narasaraopeta Municipality Centinari 100 years Celebrations

06:47 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Narasaraopeta Municipality Centinari 100 years Celebrations

గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం నూరు వసంతాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన శతాబ్ది వేడుకులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 1915లొ ఏర్పడిన నరసరావుపేట మున్సిపాల్టి శతాబ్ది ఉత్సవాలకోసం ఎపి శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు సారధ్యంలో కమిటీ గత కొన్ని రోజులుగా శ్రమించింది. డాక్టర్ కోడెల సారధ్యంలో ఆరంభమైన ఈ వేడుకలకు సిఎమ్ చంద్రబాబు హాజరై. ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నూతన అధ్యాయానికి శ్రీకారంగా సిఎమ్ పేర్కొంటూ ఈ పట్టణం త్వరలో నగరంగా మారుతుందన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. నోయోజకవర్గంలో 11 వేల 500 మరుగుదొడ్లు నిర్మించిన స్పీకర్ డాక్టర్ కోడెలను సిఎమ్ అభినందించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులను సిఎమ్ చేతులమీదుగా సత్కరించారు. జిఎమ్ ఆర్ సంస్థల అధిపతి గ్రంధి మల్లికార్జున రావు , అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి , దర్శ కేంద్రుడు కె రాఘవేంద్రరావు లను సిఎమ్ సత్కరించి , జ్ఞాపికలు అందజేశారు. ఎంపి రాయపాటి సాంబశివరావు రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, నారాయణ , పలువురు ఎం ఎల్ ఏలు , ఆహికార అనధికారులు , ప్రముఖులు ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేసాయి.

English summary

Narasaraopeta Municipality Centinari 100 years Celebrations has started on this friday .Narasaraopeta municipality has started in 1915 and today it completed 100 years