ప్రశాంతంగా నారాయణఖేడ్‌ పోలింగ్‌

Narayankhed By Elections

10:05 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Narayankhed By Elections

మెదక్ జిల్లా నారాయణఖేడ్‌ శాసనసభాస్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ శనివారం ఉదయం 7గంటలకు మొదలైంది ప్రశాంతంగా సాగుతున్న ఈ ఉప ఎన్నికలో . లక్షా 88వేల 236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 286 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 65 సమస్యాత్మక ప్రాంతాలు, 54 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా మహారెడ్డి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డి, టిడిపి అభ్యర్ధిగా మహారెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్ధిగా జె.భాస్కర్‌ పోటీ చేస్తున్న ఈ ఉప ఎన్నికలో విజయం తమదేనని టిఆర్ఎస్ ధీమాగా చెబుతోంది. అలా జరగదని విపక్షాలు అంటున్నాయి.

English summary