బం చిక్ బం యోగా చెయ్యి బాగా.. వంటికి యోగా మంచిదేగా

Narendra Modi about Yoga

12:57 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Narendra Modi about Yoga

యోగా మన జీవన విధానమని, ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల యోగా దినోత్సవం నిర్వహించారు. దేశంలో, ఏపీలో వాడవాడలా యోగా డే నిర్వహించారు. చండీగఢ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానం.. ముక్తి మార్గం వంటిది. భారత్ విజ్ఞప్తి మేరకు ఐరాస జూన్ 21న యోగా దినోత్సవంగా ప్రకటించింది.

1/6 Pages

యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోంది:

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోంది. వ్యక్తిగత, మానసిక, సామాజిక ఆరోగ్యానికి యోగాకు అధిక ప్రాధాన్యత ఉంది. యోగా సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వృద్ధి చెందుతాయి. మానసిక ఏకాగ్రత యోగా వల్లే సాధ్యమవుతుంది అని వివరించారు. యోగా సాధన కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. ఆస్తికులు, నాస్తికులు అందరికీ యోగా అవసరమన్నారు. యోగాకు పేద, ధనిక తారతమ్యం లేదు. పేదవాడైనా, జమిందారైనా యోగా సాధన చేయవచ్చన్నారు. రోగనివారణ ప్రత్యామ్నాయాల్లో యోగాకు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు.

English summary

Narendra Modi about Yoga