ప్రధాని మోడీ ఆస్తులు పెరిగాయ్... మరి భార్య ఆస్తులు తెలీదట

Narendra Modi assets was increased upto 32 lakhs

11:19 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Narendra Modi assets was increased upto 32 lakhs

సాధారణంగా పదవిలోకి వచ్చాక ఆస్తులు పెరిగితే ఏమంటారు? కూడ బెట్టారని అనుకుంటాం. మరి ప్రధాని మోడీ ఆస్తులు పెరిగాయి. ఏమనాలి? వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన వివరాల ప్రకారం మోడీ ఆస్తుల విలువ రూ. 1.73కోట్లు. 2014-15లో ఆయన ఆస్తి విలువ రూ.1.41 కోట్లు కాగా, గత ఏడాది 22.6 శాతం పెరిగాయి. ఇదే సమయంలో నగదు కూడా 19 రెట్లు పెరిగింది. గత ఏడాది తన దగ్గర రూ.4700 ఉన్నట్లు చూపిన మోడీ, ఈసారి రూ.89,700 ఉన్నట్లు ప్రకటించారు. అయితే కొత్తగా పుస్తకాల మీద రాయల్టీ కూడా వస్తోంది. మోదీ తొలిసారిగా పుస్తక రాయల్టీని ప్రస్తావించారు. పుస్తకాల రాయల్టీ ద్వారా రూ.12.35 లక్షల ఆదాయం వచ్చినట్లు చూపారు.

ఇక గతంలో చూపిన 4 బంగారు ఉంగరాలను ఈసారీ ప్రకటించారు. వాటి విలువా రూ.1.18 లక్షల నుంచి రూ.1.27 లక్షలకు చేరింది. గుజరాత్ లోని గాంధీనగర్ లో కోటి రూపాయల విలువైన ఆస్తి, అక్కడి ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.2.09 లక్షలు, అదే బ్యాంకులో రూ.51.27 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. గత ఏడాది ఈ మొత్తం రూ.31 లక్షలు మాత్రమే. వీటితోపాటు రూ.5.47 లక్షల విలువైన ఎల్ అండ్ టీ ట్యాక్స్ సేవింగ్స్ బాండ్లు, ఎల్ఐసీ, జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. తన ఆస్తుల వివరాలు సమర్పించి ప్రధాని మోడీ.. తన భార్య ఆస్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. భార్య ఆస్తుల స్థానంలో 'తెలియదు' అని పేర్కొనడం గమనార్హం.

English summary

Narendra Modi assets was increased upto 32 lakhs