ఫేస్ బుక్ లో అత్యధిక 'లైక్ ల' వీరుడు మోడీ

Narendra Modi At Second Place On Twitter

03:18 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Narendra Modi At Second Place On Twitter

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు. ఇక జనసమ్మోహన శక్తికి నిదర్శనంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో అత్యంత ఆదరణ కలిగిన(అత్యధిక లైక్లు పొందిన) ప్రపంచ నేతల జాబితాలో ఆయన ద్వితీయ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత మోడీ స్థానం మోడీదే. ఫేస్బుక్లో ఎక్కువ ఆదరణ పొందుతున్న ప్రపంచ నేతల జాబితా గురువారం విడుదలైంది. దీనిప్రకారం మోడీ ప్రతిరోజు సగటున 2.8 పోస్ట్లు చేస్తున్నట్లు ఫేస్బుక్ నివేదిక వెల్లడించింది.

ఈ నెల 15న తన తల్లితో కలిసి అధికారిక నివాసంలో ఉన్న సంగతిని మోడీ పోస్ట్ చేయగా... అత్యధికంగా 16 లక్షల లైక్లు, 34 వేల వ్యాఖ్యలు వచ్చాయి. 12 లక్షల మంది ఆ పోస్ట్ను షేర్ చేశారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చుకున్నప్పుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పిస్తున్నప్పుడు మోడీ చేసిన పోస్ట్లు అత్యధిక ఆదరణ పొందినవాటిలో వరుసగా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.

కేంద్రమంత్రుల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆహార శుద్ధిశాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఫేస్ బుక్ లో ఎక్కువ క్రియాశీలంగా ఉంటున్నట్లు తాజా నివేదిక తేల్చింది. ఇక మోడీ పాలన గురించి కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ నెగిటివ్ కధనాలు కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి.

ఇవి కూడా చదవండి:జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

ఇవి కూడా చదవండి:దేవుడా! ఇలాంటి బూతు ట్రైలర్ ఎప్పుడూ చూసి ఉండరు

English summary

Indian Prime Minister Narendra Modi stood second place in the Twitter after Barack Obama.It says that Everyday Narendra Modi posts 2.8 posts .