నేనున్నానంటూ గాంధీ మనవడికి మోడీ ఫోన్

Narendra Modi calls Gandhi grand son

05:19 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Narendra Modi calls Gandhi grand son

జాతిపిత మహాత్మాగాంధీ మనవడు కానూబాయ్‌ గాంధీ(87 బంధువుల నుంచి ఆదరణ లేక వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్న విషయం తెల్సుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌లో పరామర్శించారు. కానూబాయ్‌తో గుజరాతి భాషలో కాసేపు మాట్లాడారు ప్రధాని. ఇరువురు మధ్య మాటలు చాలాసేపు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. కానూభాయ్‌ దంపతులు హ్యాపీగా గడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మోడీ ఆదేశించారు. మరోవైపు ప్రధాని సూచన మేరకు కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్‌ శర్మ సౌత్ ఢిల్లీలోని గురు విశ్రాం వృద్ధాశ్రమంలో ఉన్న కానూభాయ్‌ దంపతులను కలుసుకున్నారు.

బంధువుల నుంచి ఆదరణలేదని, అందువల్లే ఆశ్రమంలో గడపాల్సి వస్తుందని కానూభాయ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మోదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నట్లు చేసుకున్నారు కానూభాయ్‌ గాంధీ. అన్నివిధాలుగా సహాయం చేస్తానని మోడీ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

English summary

Narendra Modi calls Gandhi grand son. India PM Naendra Modi makes a call to Gandhi grand son.