సూసైడ్ చేసుకున్న ప్రధాని మోడీ డ్రైవర్

Narendra Modi Convoy Driver Commits Suicide

10:54 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Narendra Modi Convoy Driver Commits Suicide

వాళ్ళూ వీళ్లూ అంటడా లేదు... ఈరోజుల్లో హత్యలు ఎంత సులువు అయ్యాయో, ఆత్మహత్యలు కూడా అదే మోతాదులో పెరిగిపోయాయి. ఇంతకీ విషయం ఏమంటే భారత ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సోమశేఖర అనే 33 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమశేఖర్ సొంతూరు చిత్తూరు జిల్లా కొర్లమిట్ట గ్రామం. 1999లో బీఎస్ఎఫ్ లో చేరి తన టాలెంట్ తో ప్రమోషన్ల మీద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కి వెళ్లాడు. ప్రస్తుతం ప్రధాని మోడీ కాన్వాయ్ లో పనిచేస్తున్నాడు. గతంలో సోనియా, ప్రియాంకగాంధీలకు బాడీగార్డ్ గా పనిచేసిన అనుభవం కూడా అతడికి వుంది.

ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ, సోమశేఖర్ ఉరేసుకున్నాడట. ఉరేసుకుని ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడి మృతదేహన్ని చిత్తూరు జిల్లాలోని ఆయన సొంతూరుకి పంపారు. కుటుంబ సమస్యలే సోమశేఖర ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. మరోవైపు సోమశేఖర మృతదేహాన్ని చూసి ఆయన ఫ్యామిలీసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి:అమ్మతనానికే మచ్చ తెచ్చిన సంఘటన.. కన్నబిడ్డల్ని టవల్ లో పెట్టి..

ఇవి కూడా చదవండి:నైట్ క్లబ్ ల్లో బన్నీకి పనేమిటి?

English summary

Indian Prime Minister Narendra Modi's Convey Driver Somasekhar commits suicide. The actual reason for his suicide was not known yet. Police filed case and started investigation on this incident.