నోట్ల రద్దు గురించి బిచ్చగాడికి ముందే తెలుసా?

Narendra Modi effected with Bichagadu movie scene

12:16 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Narendra Modi effected with Bichagadu movie scene

ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొంతమందికి ముందే తెలుసనీ, ఇదంతా ఓ కుంభకోణమని ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నా సంగతి తెల్సిందే కదా. అయితే ఓ బిచ్చగాడికి ఈవిషయం ముందే తెలుసని ఇప్పడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చ అవుతోంది. ఇంతకీ బిచ్చగాడంటే నిజంగా బిచ్చగాడు కాదండోయ్ బిచ్చగాడు మూవీ. ఎందుకంటే ఇటీవల విడుదలైన బిచ్చగాడు మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లు సృష్టించడమే కాదు, నోట్ల రద్దు విషయంలో మరోసారి అందరినోట బిచ్చగాడు వినిపిస్తోంది. కారణం ఆ సినిమాలో ఓ సీన్ అదిరిపోయింది. అదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే, అవినీతి నిర్మూలన గురించి ఓ ఎఫ్ఎం స్టేషన్ లో చర్చ జరుగుతుంది కదా.

ఆ కార్యక్రమానికి ఓ బిచ్చగాడు ఫోన్ చేసి అవినీతిని నిర్మూలించాలంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచిస్తాడు. తన వాదనను ఉదాహరణలతో సహా వివరిస్తాడు. అందుకే ఎప్పట్నుంచో ఈ డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఇంత హఠాత్తుగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాకింగ్ కు గురిచేస్తోంది. ముఖ్యంగా.. అందులో భాగంగా బిచ్చగాడు సినిమాలోని ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary

Narendra Modi effected with Bichagadu movie scene