చైనా బస్సుపై మనసు పడ్డ మోడీ ! (వీడియో)

Narendra Modi Impressed With straddling bus concept in China

11:15 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Narendra Modi Impressed With straddling bus concept in China

ఇదో రకం కొత్త బస్సు.. అవును రోడ్డు మీదే నడిచే ఈ బస్సు కార్లు మీదుగా కూడా ప్రయాణించే సరికొత్త మోడల్ బస్సు గా రికార్డు కెక్కేంది. ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ నిజంగా ఒక అద్భుతమే. ఇటీవల చైనాలో ప్రారంభించిన ఈ బస్సు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇక మన ప్రధాని మోడీ కూడా దీనిపై మనసు పడ్డారు. దాని సంగతేంతో కనుక్కోమని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖను ప్రధాని ఆదేశించారు.

ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ (టీఈబీ-1) పిలిచే ఈ భారీ బస్సును ఉత్తర చైనాలోని హ బెయి ప్రావిన్స్ లోని కిన్ హువాంగ్ డావో నగరంలో టెస్ట్ రన్ నిర్వహించారు. 25 అడుగుల వైశాల్యమున్న ఈ బస్సు రోడ్డు నుంచి దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మిగతా వాహనాలు ఈ బస్సుకింద నుంచి ప్రయాణం చేయవచ్చు. అంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్లినట్లుగా మిగతా వాహనాలు వెళ్లిపోతాయి. అవి వెళ్తాయనే కంటే ఈ బస్సే వాటిపైనుంచి వెళ్తుందని చెప్పొచ్చు.

రోడ్డుకిరువైపులా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా ఈ బస్సు ప్రయాణిస్తుంది. ఒకేసారి నాలుగు బస్సు కోచ్ లను కలపడం ద్వారా దాదాపు 1400 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. బస్సు లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా సీట్లు - మధ్యలో రౌండ్ సీట్లతో కంపార్టుమెంట్ చాలా స్టైలిష్ లుక్తో ఉంది. పైగా దీని తయారికి అయ్యే ఖర్చు కూడా తక్కువేనట.

కరెంటుతో పనిచేసే ఈ బస్సు రోడ్డుకు రెండువైపులా ఉండే ప్రత్యేక మార్గంపై నడుస్తుంది. మధ్యలో ఖాళీ ఉంటుంది. అంటే ఈ బస్సు ఒక బ్రిడ్జిలా ఉంటుందన్నమాట. గంటకు 60 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ బస్సు మన దేశానికి బాగా ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం కాకుండా కింద నుంచి మిగతా వాహనాలు వెళ్లేలా ఉంటుంది. అదే సమయంలో ఇందులో ఎక్కువమంది పడతారు కాబట్టి మిగతా వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ బస్సు మోడీ దృష్టిని ఆకర్షించడంతో దాని వివరాలు తెలుసుకోమని ఆదేశించారు. మరి మన దేశంలో కూడా వీటిని ప్రవేశపెడతారా లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:బాద్షా ఇల్లు విలువ తెలిస్తే, గుండె ఆగిపోతుంది

ఇవి కూడా చదవండి:తెలంగాణా రెండేళ్ల పసిబిడ్డ ... మరి ఎపి..

English summary

Prime Minister of India Narendra Modi was quite impressed with the Straddling bus concept which was invented by china and PM ordered the officials to know the details about that Straddling Bus Concept.