టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2016 పోల్ లో టాప్ లో నిలిచిన మోడీ!

Narendra Modi is top in Times Person Of The India

02:36 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Narendra Modi is top in Times Person Of The India

రెండున్నరేళ్ళపాటు పాలన సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సడన్ గా ఏకకాలంలో ఇటు దేశం - అటు ప్రపంచం చూపును తనవైపునకు తిప్పుకొన్నారు. తనదైన శైలిలో దూసుకుపోవడం ద్వారా ఒక గుర్తింపును - నల్లధనం విషయంలో మరో ఝలక్ ఇవ్వడం ద్వారా దేశం చూపును తనవైపు తిప్పుకున్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2016 పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ టాప్ లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ లను అధిగమించి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

పర్సన్ ఆఫ్ ది ఇయర్ కోసం టైమ్స్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆయన తరువాతి స్థానాలలో వరుసగా డోనాల్డ్ ట్రంప్ - వ్లాదిమీర్ పుతిన్ - బరాక్ ఒబామా ఉన్నారు. పార్టీపార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆదాయపు చట్ట సవరణ బిల్లును ఆమోదించేందుకు నేడు ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

దేశంలో నల్ల ధనాన్ని ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. నల్లధనం నివారణ - ఇ-బ్యాంకింగ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.ఏయే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందో జాతీయ పార్టీ కార్యాలయానికి వివరాలు అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. ముక్కుపిండి వసూలు చేసిన నల్ల ధనాన్ని సామాన్య ప్రజల కోసమే ఖర్చు చేస్తామన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఖర్చు చేస్తామన్నారు.

English summary

Narendra Modi is top in Times Person Of The India