దడ పుట్టిస్తున్న మోడీ తాజా వార్నింగ్

Narendra Modi Latest Warning About Black Money

11:06 AM ON 26th December, 2016 By Mirchi Vilas

Narendra Modi Latest Warning About Black Money

నవంబర్ 8న రూ 500, రూ 1000 నోట్లు రద్దు చేసాక, డిసెంబర్ 30వరకూ నోట్లు జమ చేసుకోడానికి సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. 50రోజులు కష్టాలు కూడా తప్పవని చెప్పడం కూడా తెలిసిందే. ఇప్పటికే పలు మార్పులు కూడా చేస్తూ ప్రకటనలు వెలువడ్డాయి. అయితే తాజాగా మోడీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృస్తిస్తున్నాయి. దడ పుట్టిస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరుల కష్టాలు పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అదే సమయంలో నీతిపరుల కష్టాలు క్రమంగా తగ్గుతాయన్నారు.

నల్లకుబేరులు కుయుక్తులతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తమతో పాటు బ్యాంకు సిబ్బందిని బలిచేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల్లో డబ్బు వేయడంతో సమస్యలు ఉండబోవనుకుంటోన్న నల్లకుబేరులకు మోడీ మరో హెచ్చరిక చేశారు. చట్టంలో లొసుగుల ఏదో ఒక రూపంలో తప్పించుకోవచ్చని చూస్తున్నారని, అయితే ప్రస్తుతం ఉన్నది మోడీ సర్కారనేది గుర్తుంచుకోవాలని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. బ్యాంకుల్లో డబ్బు పడటంతో నల్లబాబుల కష్టాలు ముగిసినట్లు కాదని, అసలు కష్టాలు మొదలైనట్లు గుర్తించాలని సూచించారు. కొందరు నల్లకుబేరుల కారణంగా దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్ధిక నేరగాళ్లంతా ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదని ప్రధాని హెచ్చరించారు. ఇక నాలుగు రోజులే సమయం వుంది. ఈలోగా ఇక ఎలాంటి ప్రకంపనలు పుట్టనున్నాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: ఓ ఇంటి కింద 18 అంతస్తుల భూగర్భనగరం .... దీని గురించి వింటే షాకవుతారు

ఇవి కూడా చదవండి కొత్త నోట్ల కోసం ఫ్రెండ్ ని చంపేసి తగులబెట్టారు

English summary

Indian Prime Minister Narendra Modi announced that Government was going to cancel 500 and 1000 rupees notes on November 8th and recently he again warned black money holders.