క్యూ కట్టిన మోడీ-మన్మోహన్- అద్వానీ లపై పంచ్ అదరహో

Narendra Modi, Manmohan Singh And LK Advani Picture Goes Viral

11:19 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Narendra Modi, Manmohan Singh And LK Advani Picture Goes Viral

పెద్ద నోట్ల రద్దుతర్వాత జనం బ్యాంకుల దగ్గర, ఎటిఎంల ముందు బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. ఈ కష్టాలు ఎప్పటికి గట్టెక్కుతాయో తెలీయడం లేదని అంటున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ , మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఒకే వేదిక మీదకు రావడం అరుదు. అందులోనూ వరుసలో ఉండటం ఇంకా అరుదైన విషయం. పైగా తమవంతు కోసం ఎదురుచూస్తున్నట్లు ఉండేలా ఉంటే..ఎంతో అరుదైన దృశ్యం కదా? అలాంటి అరుదైన దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అవ్వడంతో వీరలెవెల్లో కామెంట్లు - పంచ్ లు పడుతున్నాయి.

తాజాగా సర్క్యులేట్ అవుతున్న ఈ ఫోటోలో ఈ ముగ్గురు ఉద్దండులు ఆ వరుసలోనే ఓ మూలగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. దీంతో నెటిజన్లు ఒకటే పంచులు కామెంట్లు వేసుకున్నారు! "పెద్ద నోట్ల రద్దు-కొత్త కరెన్సీ కష్టాలు వీరికి కూడా మొదలయినట్లున్నాయే"...అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'పానీపూరీ అమ్మేవాడు అమ్మాయిలకు మాత్రమే పానీపూరి ఇస్తే.. ఇలాగే ఉక్రోషంగా ఉంటుంది' అని మరొకరు సెటైర్ పేల్చారు. ఇక మరో తుంటరి అయితే "ఏటీఎంలో డబ్బు కోసం కాదు.. జియో సిమ్ కోసం క్యూ కట్టినట్టు ఉన్నారే" అని ట్వీటారు. ఇక బీజేపీ అభిమానుల సంగతి సరే సరి.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రెండువేల నోటు, కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ పాత వెయ్యినోటు, మాజీ ఉప ప్రధాని అద్వానీ పాత 100 నోటు" అంటూ విశ్లేషణ చేశారు. "ముందు ప్రధాని-ఆ వెనుక మాజీ ప్రధాని-ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి" అంటూ ఇంకొకరు ఈ ముగ్గురు నేతల తీరును విశ్లేషించారు.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

ఇది కూడా చూడండి: ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

English summary

Narendra Modi, Manmohan Singh And LK Advani Picture Goes Viral.