దీప కు మోడీ ప్రశంస

Narendra Modi Praises gymnast Dipa Karmakar

05:26 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Narendra Modi Praises gymnast Dipa Karmakar

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. త్రిపురకు చెందిన 22ఏళ్ల దీపా కర్మాకర్‌ అర్హత పోటీల్లో సత్తా చాటి రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీప చరిత్ర సృష్టించింది. జమ్ములోని శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్శిటీలో మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా దీపా కర్మాకర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తన ప్రతిభతో దేశానికి కీర్తి తీసుకొచ్చిందని ప్రధాని మోడీ పేర్కొంటూ, ఆమె విజయం గర్వకారణమని అన్నారు. ఎలాంటి ఒడిదొడుకులు ఆమె విజయానికి అడ్డుపడలేకపోయాయని, పట్టుదలతో దీప తన లక్ష్యాన్ని సాధించగలిగిందని అలాగే.. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలకు సంబంధించి దృఢమైన నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించొచ్చని మోడీ యువతనుద్దేశించి ప్రసంగం సాగించారు.

ఇవి కూడా చదవండి: ముదురుతున్న పూరీ వ్యవహారం - దావాకు రెడీ

ఇవి కూడా చదవండి:

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

అమ్మాయిల రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేస్తే ఇక అంతే!

English summary

Indian Prime Minister Narendra Modi Praises Gymnast Dipa Karmakar for selecting for upcoming olympics. She was the only Gymnast from India to select for Olympic Games.