ఇక నుంచి ఫోన్లు తేవద్దని మోడీ ఎందుకు ఆదేశించారు?

Narendra Modi rejected to bring phones to cabinet meeting

12:24 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Narendra Modi rejected to bring phones to cabinet meeting

ఈరోజుల్లో చేతిలో ఫోన్ లేందే ఏ పని జరగదన్నట్లు వ్యవహారం తయారైంది. ఇక మంత్రుల కేబినెట్ సమావేశాలకు ఏపీలో పేపర్ లెస్ అంటూ టాబ్ లనే వాడుతున్నారు. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం కేబినెట్ మీటింగ్ కి అసలు ఫోన్లే తీసుకురావద్దని అంటోంది. ఈమేరకు మంత్రులకు ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన కీలక సమాచారం బయటకు పొక్కకుండా నిరోధించేందుకు ప్రధాని మోడీ ఈ చర్యలు చేపట్టారు. కేబినెట్ సమావేశాలకు మంత్రులెవ్వరూ స్టార్ట్ ఫోన్లు, ఇతర మెుబైల్స్ తీసుకురావద్దని ఆదేశించారు.

బ్రిటన్ లో ఇప్పటికే కేబినెట్ సమావేశాలకు ఫోన్లు తీసుకురావడంపై నిషేధం ఉంది. భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే ప్రథమం. ఈ నిర్ణయానికి సంబంధించిన సర్క్యులర్ ను మంత్రుల ప్రైవేటు సెక్రటరీలకు కేబినెట్ సెక్రటేరియట్ తాజాగా జారీ చేసింది. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఇటీవల భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో డాటా చోరీ ముప్పు ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రులు, అధికారుల ఫోన్లను పాక్, చైనా హాకర్లు టార్గెట్ చేసే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.

English summary

Narendra Modi rejected to bring phones to cabinet meeting