‘ఇంటర్నెట్‌ స్టార్‌’ మోడీ యే ...

Narendra Modi Selected As Internet Star

11:19 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Narendra Modi Selected As Internet Star

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరిస్తూ, ట్విట్టర్‌లో 18 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 32 మిలియన్‌ల మంది కలిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్ నెట్ లో . అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌ విడుదల చేసిన జాబితాలో ఆయన వరసగా రెండో ఏడాదీ స్థానం దక్కించుకున్నారు. ఇంటర్ నెట్ లో ఎప్పుడు ఆయన గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆ జాబితాలో మ్యాగజైన్‌ మోడీ ‘ఇంటర్నెట్‌ స్టార్‌’ అంటూ ప్రస్తావించింది. ర్యాంకులు ఇవ్వకుండా ఆ మ్యాగ్‌జైన్‌ ప్రపంచంలో నెట్టింట్లో అత్యంత ప్రభావవంతులైన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మోడీతోపాటు, అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, టీవీ రియాలిటీ స్టార్‌ కిమ్‌ కర్దషైన్‌, ఆమె భర్త కైనే వెస్ట్‌, రచయిత్రి జేకే రౌలింగ్‌, ఒలింపిక్‌ మాజీ అథ్లెట్‌ కెయిత్లిన్‌ జెన్నర్‌, సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డో తదితరులు ఉన్నారు.

టైమ్స్‌ మ్యాగజైన్‌ మోడీ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోడీ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని చెప్పింది. తాజా పరిణామాల్ని ట్వీట్‌ చేయడం ద్వారా మోడీ సమాచార మార్పిడిని మరింత సులభతరం చేశారని టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌ వివరించింది.

English summary