పాక్ కి నిద్ర లేకుండా చేస్తానంటున్న మోడీ

Narendra Modi shocking comments on Pakistan

11:12 AM ON 1st October, 2016 By Mirchi Vilas

Narendra Modi shocking comments on Pakistan

ఇప్పుడు నేను సుఖంగా నిద్రపోతా.. పాకిస్థాన్ కు నిద్రలేకుండా చేస్తా అని ప్రధాని మోడీ అంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపి విజయవంతంగా తిరిగి వచ్చిన తరువాత ప్రధాని మోడీ ముఖంలో ఆనందం కనిపించింది. ఆపరేషన్ సక్సెస్ అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్ ఫోన్ చేసి చెప్పిన తరువాత ప్రధాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 56 అంగుళాల ఛాతీ అన్నావు.. ఎన్నికల సమయంలో ఏవేవో చెప్పావు. అధికారంలోకి వస్తే పాకిస్తాన్ విషయంలో కంటికి కన్ను, పన్నుకు పన్ను అన్నావు. పఠాన్ కోట్ లో తీవ్రవాదులు దాడులు జరిపారు.

ఉరీలో ఆర్మీ క్యాంప్ పైనే దాడులు చేశారు. ఏం నిద్రపోతున్నావా మోడీ? అంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో నాకు అసలు నిద్ర పట్టలేదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. దెబ్బకు దెబ్బ తీశాం అంటూ వెంకయ్యకు మోడీ వివరించారు. సర్జికల్ స్ర్టైక్స్ జరిగిన విధానాన్ని అంతా కేంద్రమంతి వెంకయ్యకు వివరించారట. వాస్తవానికి, ఎన్నికల ముందు పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన మోడీ, అధికారం చేపట్టాక పాక్ కు అనేక సార్లు స్నేహహస్తం అందించారు. ఈ వైఖరిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దుయ్యబట్టింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్లలో పాకిస్థాన్ ను కట్టడి చేశామని, మోడీ పిలవని పేరంటానికి వెళ్లినట్లుగా షరీఫ్ ఇంటి పెళ్లికి వెళ్లారంటూ ఎద్దేవా కూడా చేసింది. అయితే మోదీ ఇవన్నీ చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అందుకే విజయాలు సొంతం అంటున్న నాని

ఇది కూడా చదవండి: భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు(వీడియో)

ఇది కూడా చదవండి: షాకింగ్: భర్తను చంపిన ఐసిస్ ఉగ్రవాదుల తల కోసి కూర వండేసింది(ఫోటోలు)

English summary

Narendra Modi shocking comments on Pakistan. Indian Prime Minister Narendra Modi shocking comments on Pakistan.