అంతులేని ఫోర్జరీ - మోడీ సంతకాన్ని చేసి దొరికిపోయారు

Narendra Modi sign forgery by 2 persons

11:42 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Narendra Modi sign forgery by 2 persons

మోసాలు, చీటింగ్ లకు కొడవలేదన్నట్లు వ్యవస్థ నడుస్తోంది. ఫోర్జరీ సంతకాలతో పనులు కానిచ్చే ప్రబుద్ధులు చివరకి ప్రధాని నరేంద్ర మోడీని కూడా వదిలి పెట్టలేదు. మోడీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. పండిట్ స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ బర్మన్ ను జార్ఖండ్ లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాయ్, బర్మన్ తో కలిసి 2015 మే నెలలో ప్రధాని మోడీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఆగస్ట్ 15 వేడుకల్లో సంగీత కచేరి నిర్వహించాలని ప్రధాని మోడీ తనకు లేఖ రాసినట్లు అధికారులకు చూపాడు.

అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు దానిపై పీఎంవో కార్యాలయం నుంచి ఆరా తీశారు. దీంతో అది ఫోర్జరీ లేఖగా తేలింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో ఎట్టకేలకు నింధితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగాల్ లో వారు ఫోర్జరీకి పాల్పడిన మరి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నింధితులను సీబీఐ కోర్టులో హాజరుపర్చగా, జూలై 27 వరకు కస్టడీ విధించింది.

English summary

Narendra Modi sign forgery by 2 persons