తెలంగాణా రెండేళ్ల పసిబిడ్డ ... మరి ఎపి..

Narendra Modi Visit Of Telangana

10:48 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Narendra Modi Visit Of Telangana

తెలంగాణను ప్రధాని నరేంద్రమోడీ రెండేళ్ల పసిబిడ్డగా అభివర్ణించారు. తెలంగాణలో ఇదే తన తొలి పర్యటన అంటూ.. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ, కేంద్రం - తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని, దీన్నే సహకార సమాఖ్య అంటారని పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అంతకుముందు కోమటిబండలో మిషన్ భగీరథ మొదటి దశని ప్రారంభించారు. మిషన్ భగీరథ మహత్తర కార్యక్రమం అని, తెలంగాణ సీఎం కేసీఆర్ ని చూస్తే నీళ్లే ఆయన జీవిత లక్ష్యమని ప్రశంసించారు. పంచభూతాల్లాగా ఈరోజు ఐదు ప్రాజెక్టులను ప్రారంభించానని, రైతులకు నీళ్లు ఇస్తే మట్టిలో బంగారం పండిస్తారని మోడీ పేర్కొన్నారు. గుజరాత్ లో కచ్ ప్రాజెక్ట్ లాగా, తెలంగాణలో తాగునీటి ప్రాజెక్ట్ చేపట్టానని కేసీఆర్ తనతో చెప్పేవారని ఆయన అన్నారు.

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాలంలో యూరియా కొరతపై ఏ సీఎం కూడా లేఖ రాయలేదని మోడీ పేర్కొంటూ, ఇప్పుడు ఎరువుల కొరత లేదని, ధరలు బాగా తగ్గాయని అన్నారు. విద్యుదుత్పత్తికి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టామన్నారు.

తెలంగాణ ఏర్పడిన కొత్త రోజుల్లో యూనిట్ విద్యుత్ రూ.11 ఉండేదని, కానీ ఇప్పుడది రూపాయి పదిపైసలు తగ్గిందని మోడీ గుర్తుచేశారు. అంతకుముందు మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి అవినీతి రహిత ప్రభుత్వాన్ని, రైతు పక్షపాత ప్రభుత్వాన్ని చూశామన్నారు.

కాగా మోడీ రాకను ఉద్దేశించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. స్నేహితుల దినోత్సవం రోజున మొదటిసారిగా మోడీగారి రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉదయాన్నే పోస్ట్ పెట్టారు. ఫ్రెండ్ షిప్ రోజున జరగనున్న కార్యక్రమ సందర్భంగా ఇకపై కేంద్రం నుంచి తెలంగాణకు అవసరమైన స్నేహ హస్తం, మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి:అల్లు శిరీష్ ని బేవర్స్ ఎదవా అనేసింది

ఇవి కూడా చదవండి:బాద్షా ఇల్లు విలువ తెలిస్తే, గుండె ఆగిపోతుంది

English summary

On Madein Visit of Telangana, Narendra Modi start five projects and Narendra Modi said that Telangana state was a two year old baby.