కిరాణా కొట్లో పనిచేస్తోన్న మోడీ వైఫ్..

Narendra Modi wife doing work in general stores

11:11 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Narendra Modi wife doing work in general stores

ఆరోజుల్లో నిస్వార్ధంగా సేవ చేసే రోజులు ఉండేవి. మరి ఇప్పుడు ఓసారి పదవి వచ్చిందంటే తరతరాలు తిని కూర్చున్నా తరగని ఆస్తి సంపాదిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే, ఎంపీ అయితే వారి పేరు చెప్పుకొని దందాలు, కబ్జాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించుకునే బామ్మర్దులు, బంధువులు, భజనపరులు సరే సరి. ఇక మనకు తెలిసివాళ్ళు రాజకీయాలలో ఉంటే వారి పేరు చెప్పుకొని చాలా పనులు చేయించుకుంటాం మనం, కానీ సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రికి భార్య అయినప్పటికీ కూడా ఓ సాధారణ మహిళగా ఉండటం అనేది మాములు విషయం కాదు, పైగా సాదాసీదాగా ఓ షాపులో పనిచేయడం ఆషామాషీ కానేకాదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భార్య మాత్రం మాములు జీవితం గడుపుతూ ఒక కిరాణా దుకాణంలో పని చేస్తుంది అంటే ఇది ఆశ్చర్యపోక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ భార్య అయిన జశోదా బెన్ ప్రస్తుతం గుజరాత్ లో తన సోదరుడి ఇంట్లో ఉంటుంది. తన సోదరుడికి ఉన్న కిరాణా షాపులోనే పనిచేస్తూ అతనికి సహాయంగా వుంటున్నారు. దేశ ప్రధాని భార్యగా జశోదా బెన్ కి ఎస్పీజీ కమాండోలు భద్రతని కల్పిస్తున్నారు, నరేంద్ర మోడీ అన్నలు కూడా వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ చాలా మామూలుగానే జీవిస్తున్నారు, కుటుంబంలో ఒక్కరు ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే చాలు ప్రజల సొమ్ముతో కార్లు, బంగ్లాలని కొనేయడం, నానా హంగామా చేసెయ్యడం, ఈరోజుల్లో కామన్ అయిపోయింది. అయితే అలాంటి వారంతా వీరిని చూసి కొంతైన నేర్చుకుంటే, దేశంలో అద్వితీయ మార్పులు రావడం తధ్యం.

English summary

Narendra Modi wife doing work in general stores