షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిన టాప్ హీరోయిన్‌

Nargis Fakhri get unconscious in shooting

11:11 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Nargis Fakhri get unconscious in shooting

సినిమా షూటింగ్ లలో ఒక్కోసారి ప్రమాదాలు, మరోసారి అనుకోని సంఘటనలు జరుగుంటాయి. హీరోలు ఫైటింగ్ సీన్లలో గాయపడడం, మరోసారి ఊహించని ప్రమాదాలు జరిగి నటులు గాయపడడం తెలిసిందే. అయితే బాలీవుడ్‌ నటి నర్గిస్‌ ఫక్రి షూటింగ్ సెట్ లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. నర్గిస్‌ ప్రస్తుతం 'అజహర్‌' చిత్రంలో నటిస్తోంది. షూటింగ్‌ పూర్తయినా చిత్రబృందం అదనంగా మరో పాటను చిత్రీకరించాలనుకుంది. 1989లో వచ్చిన 'త్రిదేవ్‌' చిత్రంలోని 'ఓయె ఓయె' పాటను రీమేక్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నర్గిస్‌ డ్యాన్స్‌ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయింది.

చిత్రబృందం వెంటనే వైద్యుడిని పిలిపించి నర్గిస్‌కి చికిత్స ఇప్పించింది. నర్గిస్‌ ముందే తీవ్ర జ్వరంతో బాధ పడుతుండగా, తర్వాత ఇలా జరగడంతో చిత్రబృందం చిత్రీకరణ నిలిపేసింది. ఈ పాట ఎంతో ఆతృతగా చేయాలనుకున్నానని డ్యాన్స్‌ చేస్తుండగా నీరసంగా కళ్ళు తిరిగినట్లు అనిపించిందట. ఇలా జరగడంతో వైద్యులు కొన్ని రోజులు విరామం తీసుకోమన్నారని, తగ్గిన వెంటనే సెట్స్‌కి వెళ్లిపోతానని నర్గిస్‌ చెప్పింది. మొత్తానికి ప్రమాదం లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Nargis Fakhri get unconscious in shooting. Hot beauty Nargis Fakhri get unconsciuous in shooting time.