ఆ దర్శకుని పారితోషకం 15 వేలా!

Narthanasala Director Remuneration Was 15 Thousand

10:59 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Narthanasala Director Remuneration Was 15 Thousand

పౌరాణిక బ్రహ్మ అనగానే ఠక్కున గుర్తొచ్చేది దర్శక ప్రతిభాశాలి కమలాకర కామేశ్వర రావే. పురాణ చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘శ్రీకృష్ణతులాభారం’, ‘పాండవ వనవాసం’, ‘నర్తనశాల’, ‘కృష్ణావతారం’, ‘శ్రీకృష్ణవిజయం’, ‘వీరాంజనేయ’, ‘బాలభారతం’ వంటి చిత్రాలు ఎన్నో చిత్రాలు కామేశ్వరరావుగారి ‘పౌరాణిక ప్రతిభ’ని చాటుతాయి. గ్రాఫిక్స్ , సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలో అద్భుత పౌరాణిక కళాఖండాలు అందించారాయన.

ఆ నాడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ సెల్యూలాయిడ్ పై అద్భుతమూ, అపూర్వమూ అయిన 'నర్తనశాల’ కు ఉన్న క్రేజ్ వేరు. అందుకే నందమూరి బాలయ్య మళ్ళీ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ విశ్వ ప్రయత్నంలో వున్నాడు. ఇంతకీ ఆ చిత్రానికి దర్శకుడు కామేశ్వరరావు తీసుకొన్న పారితోషికం 15వేలట!

English summary

Nartanasala an Indian epic mythological, Telugu film written by Samudrala Raghavacharya and directed by Kamalakara Kameshwara Rao. For This film Kamalakara Kameshwara Rao paid 15 thousand rupees as his remuneration.he film received awards for best production design and best actor to S. V. Ranga Rao, at the Indonesian Film Festival