అచ్చం .. భూమి లాగే మరో 20 గ్రహాలున్నాయా!

NASA found Some Planets Similar To Earth

11:09 AM ON 5th August, 2016 By Mirchi Vilas

NASA found Some Planets Similar To Earth

శాస్త్ర సాంకేతిక రంగాల్లో, పరిశోధనల ఫలితంగా కొత్త విషయాలు, అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు మరో అద్భుతాన్ని గుర్తించారు. అదేమంటే, భూమిని పోలిన, ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర కుటుంబానికి వెలుపల అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ వ్యోమనౌక కనుగొన్న దాదాపు 4వేల గ్రహాల్లో ఇవి ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త రవి కుమార్ కొప్పారపు కూడా ఉండడం విశేషం. తాజా పరిశోధనలో భాగంగా నక్షత్రాల చుట్టూ ఉన్న ఆవాసయోగ్య ప్రాంతంలో 216 గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఫలితంగా అక్కడ ద్రవ రూపంలో నీరు మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. మొత్తంమీద 20గ్రహాలు శిలామయంగా ఉండి, ఆవాసయోగ్యంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి భూమితరహాలో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వివరించారు. పుడమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఎంత విస్తృతంగా ఉన్నాయి? జీవం ఉనికి ఎంత సాధారణమన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే జీవనం సాగించడానికి ఇంకా భూలోకాలు చాలానే వున్నాయన్న మాట.

ఇవి కూడా చదవండి:ఫస్ట్ కిస్ కి సిగ్గుపడ్డా...

ఇవి కూడా చదవండి:ఈ బామ్మ ఆనందానికి అవద్దుల్లేవ్.. శతాధిక వృద్ధురాలికి బర్త్ డే సెలెబ్రేషన్స్

English summary

NASA found that there were some planets in the Universe which were similar to earth and NASA also found that there were some planets which human can live.