అమూల్య మైన సంపదపై నాసాకు అంత నిర్లక్ష్యమా!

NASA In Deep Trouble Because Of Moon Mud

11:33 AM ON 11th August, 2016 By Mirchi Vilas

NASA In Deep Trouble Because Of Moon Mud

ఎంతో జాగ్రత్తగా వుండాలిసిన అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) తనకు తెలియకుండానే పెద్ద పొరపాటు చేసేసింది. ఫలితంగా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. 1969లో మొట్టమొదటిసారి నాసా అపోలో 11 ద్వారా చంద్రుడి మీదకు మనుషులను పంపించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

అపోలో ద్వారా చంద్రుడిపై కాలుమోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ లు చాలా గంటలపాటు అక్కడే గడిపారు. ఆ తర్వాత చంద్రుడిపై ఉన్న మట్టి, ఇతర పదార్థాలను 20 కేజీల సంచిలో సేకరించారు. గతేడాది ఈ సంచిని పొరపాటున నాన్సీ కార్ల్ సన్ అనే వ్యక్తికి 995 డాలర్ల(దాదాపు రూ.66వేలు)కు అమ్మేసింది. అయితే ధ్రువీకరణ కోసం కార్ల్ సన్ ఆ సంచిని తిరిగి నాసాకు తీసుకురావడంతో పొరపాటును తెలుసుకున్న అధికారులు, దానిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. అది జాతీయ సంపద కాదని, అదో వెలలేని సంపద అని వాదిస్తున్నారు.

దీంతో తనకు విక్రయించి తిరిగి సంచిని తీసుకున్న నాసాపై కార్ల్ సన్ కోర్టుకెక్కాడు. నాసాకు వ్యతిరేకంగా కోర్టులో దావావేవాశాడు. తన సంచిని తనకు ఇప్పించాల్సిందిగా కోరాడు. దీంతో నాసా కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ బ్యాగ్ వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. 2005లో కన్సాస్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఈ సంచిని దొంగిలించాడు. అతడి గ్యారేజ్ లో దాచిపెట్టిన సంచిని సానా అధికారులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:ప్రియురాలు పడిపోతుంటే కాపాడాల్సింది పోయి ఏం చేసాడో చూడండి

ఇవి కూడా చదవండి:యువతిని రేప్ చేసి హత్య చేసిన గూగుల్ మేనేజర్!

English summary

A Man Named Nancy Clarson has purchased Moon Mud from NASA for 995 US Dollars and later NASA rejected to give that Mud to him and he filed a case on NASA on Court.