డబ్బున్నోళ్లతో శృంగారం చేస్తూ, ప్రపంచం చుట్టేసిన నెరజాణ

Natalie wood doing romance with rich men and visited more than 100 countries

01:16 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Natalie wood doing romance with rich men and visited more than 100 countries

ఈలోకంలో ఒక్కక్కరూ ఒక్కో టైపు. ఈ నెరజాణ మాత్రం డబ్బున్నోళ్లను పట్టేసి, వాళ్ళతో శృంగారం పంచుకుంటూ ఏకంగా ప్రపంచం చుట్టేసింది. ఒక్కపైసా ఖర్చు లేకుండా వంద దేశాలు తిరిగేసింది. తద్వారా ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ మరి దేనికీ లేదని ఈ మాయలేడి నిరూపించింది. అంతేకాదు, ఈ అందమైన ప్రంపంచంలో వింతలు విశేషాలు చూడాలంటే ఖచ్చితంగా డబ్బుండాల్సిందే. కానీ ఈ ముద్దుగుమ్మకు డబ్బు లేకపోయినా, తన అందాలనే ప్రపంచ పర్యటనకు పెట్టుబడిగా మలచుకుని, డబ్బున్న మగాళ్లతో డేటింగ్ చేస్తూ, తనకిష్టమైన ప్రదేశాలు తిరిగేస్తోంది.

బ్రిటన్ లోని కాంటర్ బరీకి చెందిన 30 ఏళ్ల ముద్గుగుమ్మ నటాలి వుడ్ ఒక్క పైసా కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా ప్రపంచ పర్యటన చేస్తోంది. డేటింగ్ వెబ్ సైట్ మిస్ ట్రావెల్ లో రెండేళ్ల క్రితం సభ్యత్వం తీసుకున్న నటాలి తనతో డేటింగ్ చేస్తున్న సంపన్నులను ఈ ప్రపంచ పర్యటనకు ఎంచుకుంటోంది. ఏ దేశం వెళ్తే ఆ దేశంలోని సంపన్నులతో నటాలి ఎంజాయ్ చేస్తోంది. ఆమె పర్యాటక ఖర్చులన్నీ ఆ సంపన్నులే పెట్టుకుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇప్పటికే ఇలా డేటింగ్ ద్వారా నటాలి.. టర్కీ, అబుదాబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ లాంటి 100 దేశాల్లో విహరించింది.

సంపన్నులను సంతృప్తి పరుస్తూ.. ఆమె ఖరీదైన షాపింగ్ కూడా చేస్తోందట. అంతేకాదు.. ఈ ప్రపంచ పర్యటన ద్వారానే తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటుందట. తానెవరినీ మోసం చేయడం లేదని.. స్థోమత ఉన్న వాళ్లే తనను భరిస్తున్నారని నటాలి చెప్పుకొస్తోంది. ఏదైతేనేం ఈ ముద్దుగుమ్మ ఇది అనుకుంటే అది జరిగిపోతోంది. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తోంది. లైఫ్ ని ఎంజాయ్ చోస్తోంది. మరి దీనికి కూడా టాలెంట్ ఉండాలి కదా మరి.

English summary

Natalie wood doing romance with rich men and visited more than 100 countries