సల్మాన్ మళ్లీ బుక్కయ్యాడు

National Commission For Women Notices To Salman Khan

10:32 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

National Commission For Women Notices To Salman Khan

అసలే ఆమధ్య వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. అందుకే మహిళా సంఘాలు తిట్టిపోస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. సల్మాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సంఘాలు, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో సల్మాన్ కు సమన్లు కూడా అందాయి. మహిళలపట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు లలితా కుమార మంగళం తెలిపారు. సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, అసలు ఎందుకిలా చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ఆదేశించామన్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమంటే, సల్మాన్ రెజలర్ గా నటిస్తోన్న 'సుల్తాన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ లో రెజలర్ గా యాక్ట్ చేసిన అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు సల్మాన్ వింతగా సమాధానమిచ్చాడు. రింగ్ నుంచి బయటకు వ చ్చిన ప్రతిసారీ తాను రేప్ కు గురైన మహిళలా ఫీలయ్యేవాడినని, అడుగులు సరిగా పడేవి కావన్నాడు. ప్రతిరోజు షూటింగ్ జరిగే ఆరు గంటలపాటు బరువులు ఎత్తడం లాంటివి ఉండేవని, వివిధ కోణాల్లో ఒకే షాట్ ను చిత్రీకరించేందు కోసం 120 కిలోల మనిషిని పదేపదే పైకి ఎత్తి కింద పడేయాల్సి వచ్చేదని సల్మాన్ సినిమాకోసం ఎంత కష్టాడో వివరించే ప్రయత్నం చేస్తూ బుక్కైపోయాడు. ఇంకేముంది? అందరూ తిట్ల దండకం అందుకుంటున్నారు. ఈ వివాదంలో మళ్లీ ఏం ముంచుకొస్తుందో ఏమో?

ఇవి కూడా చదవండి:యాక్సిడెంట్ లో యంగ్ హీరో మృతి... విషాదంలో ఫాన్స్

ఇవి కూడా చదవండి:ఇప్పుడు గంటలో ఇల్లు కట్టేయొచ్చు(వీడియో)

English summary

Bollywood Star Hero Salman Khan was struked into another controversy by saying that he felt like a raped woman when he was in the shooting of his latest flick "Sultan". National Commission for women(NCW) fired on Salman words and they send legal notices to Salman Khan and asked him the reason why he made such a words on Women and they demanded an apology over Salman's words.