షాకింగ్ న్యూస్ : 'చచ్చిపోతున్నాం మొర్రో.. అన్నా సరే ...

National Security Guards negligence on defence guard death

01:03 PM ON 6th February, 2017 By Mirchi Vilas

National Security Guards negligence on defence guard death

కొన్ని విషయాలు వెంటనే వెలుగులోకి వస్తాయి. మరికొన్ని కొంచెం ఆలస్యంగా తెలుస్తాయి. ఇంకొన్ని ఎప్పటికీ గోప్యంగానే ఉంటాయి. ప్రస్తుతం మనం రెండవ కోవలో ఓ విషయం గురించి ప్రస్తావించుకోవాలి. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు పఠాన్ కోట్ పై దాడికి పాల్పడినప్పటి సంగతి ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆ సమయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్ జీ), ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు ఇచ్చిన తాజా వాంగ్మూలంలో ద్వారా తెలిసింది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్స్(డీఎస్ సీ)ను కాపాడమని ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరినా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పట్టించుకోలేదని వింగ్ కమాండర్ అభిజిత్ సరీన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

తమలో ఒకరు చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఉన్నారని, తమను తరలించకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని డిఫెన్స్ సెక్యూరిటీ కాప్స్ ను వైర్ లెస్ లో కోరామని అభిజిత్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఎన్ఎస్ జీ కమాండో బృందానికి నేతృత్వం వహిస్తున్న గౌతమ్ గంగూలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లమని కోరినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అభిజిత్ ఆరోపణలను ఎన్ఎస్ జీ ఖండించింది. ఆ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరుపుతూ పరుగులు తీస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొందని బ్రిగేడియర్ గంగూలీ ఎన్ఐఏకు తెలిపారు. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్ జీ మధ్య సమన్వయం లేదన్న విషయం స్పష్టమైందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. విషయం కోర్టు పరిధిలో ఉండడంతో ఇంతకుమించి మాట్లాడేందుకు జంకుతున్నారు. కోర్టులో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.

ఇది కూడా చూడండి: గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఇబ్బందే.. అయితే ఏం చేయాలి

ఇది కూడా చూడండి: మహిమ గల ఆంజనేయుడు .. అందుకే కసాపురం వెళ్లాల్సిందే

English summary

defence security guard death was cuased by negligence of National Security Guards.