ఇంతకీ జక్కన్న ఎక్కడోడు

Native Place Of Rajamouli

11:15 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Native Place Of Rajamouli

అదేనండి. స్టూడెంట్ నెంబర్ -1 నుంచి బాహుబలి వరకూ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ , బాహుబలి -2లో బిజీ గా ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి. దర్శక ధీరుడు గా పేరొందిన జక్కన్న కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో ఎగిరి గంతెయ్యలేదు. పైగా ఆశ్చర్య పోయాడట. ఎందుకంటే, కర్నాటక రాష్ట్రం నుంచి ఎంపికయ్యానని తెల్సి .... పైగా వద్దనుకున్నా వచ్చేసిందట. ఈ విషయం పై రాజమౌళి స్పందిస్తూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. అదేమంటే గతేడాది ఆంధ్రప్రదేశ్ తరఫున పంపిన పద్మ పురస్కారాల జాబితాలో రాజమౌళి పేరు ఉందట. అయితే ఆ విషయం తెలిసి రాజమౌళి వద్దని చెప్పడంతో తుది జాబితా నుండి పేరును తొలగించారు. ఇప్పుడు అవార్డ్ వచ్చిందని తెలిసి "వద్దన్నా వచ్చింది" అనుకున్నారట. తీరా అది కర్నాటక రాష్ట్రం నుండి అని తెలిసి షాక్ తిన్నాడట. ఇంతకీ కర్నాటక నుంచి ఎందుకు వచ్చిందంటే, "నేను పుట్టింది కర్నాటక. చదివింది ఆంధ్రప్రదేశ్. పనిచేసింది తమిళనాడులో. సెటిల్ అయ్యింది తెలంగాణ" అంటున్నాడు. ఇలా నాలుగు రాష్ట్రాల వారినీ తనతో కలిపేసుకున్నాడు. దటీజ్ ఎస్.ఎస్.రాజమౌళి. ఇంతకీ జక్కన్న పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. కానీ ఇంటిపేరు జోడించకుండా చలామణి అయిపోతున్నాడు. ఓ పక్క పద్మ శ్రీ పురస్కారం, మరోపక్క బాహుబలి కి ఐఫా లో బహుమతుల పంట తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జక్కన్నకు బాహుబలి -2 ఎలాంటి టర్నింగ్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ....

English summary

Top Director S.S.Rajamouli Shocked about the Award Padma Shri he got and he came to know that he was nominated from Karnataka State.Rajamouli says that he was born on Karnataka and he studied in Andhra Pradesh and worked at Tamilnad and Setteled in Telangana State.His Movie Bahubali got many awards in recent IIFA Awards