దగ్గు నుండి దూరం చేసే చిట్కాలు

Natural cough remedies

07:35 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Natural cough remedies

దగ్గు చిన్న సమస్య కాదు అలా అని ప్రతి ఒక్కరికి దగ్గు పెద్ద సమస్యకాక పోవచ్చు. కాని ఏదైనా సరే కొమ్మగా ఉన్నప్పడే తుంచేయాలి అది పెరిగి మానయితే చాలా కష్టం. అందకే దగ్గుని తక్కువంచనా వేయకుండా మొదట్లోనే అరికట్టడం మంచిది. కొంత మందికి గొంతు పొడిబారడం వల్ల, కఫం ఎక్కువగా ఉండటం వలన మరికొందరికి అనారోగ్యపరమైన సమస్యల వల్ల దగ్గు వస్తుంది. ఇంతే కాకుండా గొంతులో ఏమైన ఇన్‌ఫెక్షన్‌ జరిగినా కూడా దగ్గు వస్తుంది. పొడి దగ్గు, వివిధ రకాల దగ్గులను ఇంట్లో కొన్ని చిట్కాలను వాడటం ద్వారా తగ్గించుకొవచ్చు.

1/5 Pages

తేనె

తేనె దగ్గుకు మంచి ఉపశమనం. చిన్నపిల్లలు దగ్గుతో భాధపడుతుంటే పెద్దవారు వారి నాలిక మీద తేనెని రాస్తారు. అలా చేయడంవలన దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె దగ్గుని నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ వాడవచ్చు. కాని 2 సంవత్సరాల లోపు పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది.

కావలసినవి:

  • స్వచ్ఛమైన తేనె

ఉపయోగించే విధానం:

ఒక స్పూన్‌ తేనెని రోజుకి 1 నుండి 3 సార్లు తాగడం వలన దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. నిద్రపోయే ముందు దగ్గువల్ల సమస్యరాకుండా ఉండాలంటే తేనె తాగడం మంచిది.

English summary

Natural cough remedies. There are two primary type of coughs, dry and proactive