తాజ్ మహల్ ని మూడుసార్లు అమ్మేసిన ఘనుడు!

Natwar Lal sold Taj Mahal three times

11:31 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Natwar Lal sold Taj Mahal three times

ఈమధ్య ఎక్కడ విన్నా, చూసినా ఇల్లు, భవనాలు, స్థలాలు కబ్జా చేసి అమ్మేస్తున్నారని... అయితే గతంలో రైల్వేస్టేషన్ ని ఓ ప్రబుద్ధుడు అమ్మేసినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే చారిత్రాత్మక కట్టడాలైన తాజ్ మహల్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ లని కూడా అమ్మేయడం మాటలు కాదు కదా. ఇక ఇప్పుడో ప్రబుద్ధుడు పార్లమెంటు అందులోని ఎంపీలతో సహా అందరిని అమ్మేశాడంట. బీహార్ లోని బాంగ్రా గ్రామానికి చెందిన నట్వర్ లాల్ స్వతహాగా లాయర్. అయితే అతను ఎవరి సంతకాన్ని అయినా ఫోర్జరీ చేయగలడట. మొదట్లో ధీరుభాయి అంబానీ, టాటా, బిర్లా వంటి ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ అకౌంట్ల నుండి డబ్బుని బ్యాంక్ నుండి డ్రా చేసేవాడట.

అంతే కాకుండా తాను ప్రభుత్వ ఉద్యోగినని, ఆఖరికి ఉప రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి తాజ్ మహల్ ని విదేశీయులకి ఒకటి కాదు మూడు సార్లు అమ్మేశాడంట ఈ మేధావి. ఇలాంటి వందకు పైగా నేరాలు చేసిన నట్వర్ లాల్ కి 113ఏళ్ళ జైలు శిక్ష పడిందంట. కానీ అతడు 20 ఏళ్ళకి మించి శిక్షని అనుభవించలేదంట. జైలు నుండి తొమ్మిది సార్లు తప్పించుకున్న ఈ అపార మేధావి 1996లో తన 84 ఏళ్ళ వయసులో చక్రాల కుర్చీమీద ఉండి కూడా పారిపోయాడంట. అదే ఇక అతను ఆఖరిసారి కనిపించడం అని ఆతర్వాత కూడా తన చావు మిస్టరీగా మారిందని అంటుంటారు. ఇక అతని మీద అయితే బాలీవుడ్ లో అనేక రకాలైన సినిమాలు వచ్చాయి.

అలాంటి నట్వర్ లాల్ తన గ్రామానికి ఎప్పుడు హీరోనేనటా. ఎందుకంటే అతను దోచుకున్న ధనాన్ని వాళ్ళ గ్రామానికి, గ్రామంలోని పేదవాళ్ళకి ఇచ్చేవాడంట. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేయడానికి సిద్దమైపోయారంట ఆ గ్రామస్తులు. ఏమి చేస్తాం, ఇలాంటి వాళ్ళకోసమే కదా మన పెద్దలు స్వాతంత్య్రం తెచ్చింది.

ఇది కూడా చదవండి: ఇండియా టాప్ 100 కోటీశ్వరులు వీరే!

ఇది కూడా చదవండి: తండ్రిపై ప్రేమతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏం చేసారో తెలిస్తే ఆరాధిస్తారు!

ఇది కూడా చదవండి: యాంకర్ లాస్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్(వీడియో)

English summary

Natwar Lal sold Taj Mahal three times. Natwar Lal did forgery's of all politicians and sold taj mahal three times. With that money he gave to poor people.