నవగ్రహాలకు ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసా?

Navagrahas Favourite Food

02:59 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Navagrahas Favourite Food

నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులు అని అందరికీ తెలుసు. అయితే మనం పుస్తకాలలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు 9 అని దానిలో ప్లూటో అనే గ్రహం తొలగించబడింది అని చదువుకున్నాం. అయితే భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో జీవితాలపైన ప్రభావం చూపే గ్రహాలకు, ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంచెం తేడా ఉంది. సూర్య చంద్రులను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పిలుస్తారు. ఇంకా యురేనస్ నెప్ట్యూన్ లు ఈ లెక్కలోకి రావు. కాని రాహు, కేతువులు రెండూ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే హిందూ సంప్రదాలలో నవగ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు చేయడం వల్ల మంచి జరిగి అదృష్టం వరిస్తుందని హిందువుల గట్టి నమ్మకం. నవగ్రహాలను వారు ఇష్టపడే ఆహారంతో పూజిస్తే వారి ఆశీస్సులు కచ్చితం గా పొందవచ్చు. అయితే కొంత మంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రీతికరమైన ఆహారం కూడా ఉంది అని వారు అంటున్నారు. మరి మీరు కూడా నవగ్రహాలకు ఇష్టమైన ఆహారాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుని వాటితో పూజించి ఆశీస్సులు పొందండి.

1/9 Pages

రవి (సూర్యుడు)

ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అగ్నికి గుర్తు. సూర్యభగవానుడు ఎరుపు రంగుని ఇష్టపడతాడట. అందుకే బెల్లం, ఎరుపు పప్పులు, కేసరి, కుంకుమ పువ్వు, గోధుమలు, ఎరుపు పండ్లుతో పూజించి సూర్య భగవానుడిని శాంతింపజేస్తే దీర్ఘాయువును ప్రసాదిస్తాడట.

English summary

Navagraha are deities in Hindu belief and Hindu astrology. Here we have listed about Navagrahas Favourite Food.