నవదీప్ యాంకరింగ్ అదుర్స్

Navdeep anchoring in Brahmotsavam audio launch

09:51 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Navdeep anchoring in Brahmotsavam audio launch

ఓ సినిమా ఫంక్షన్ జరిగితే, దానికుండే ఇంపార్టెంట్ వేరు... ఇక ఇవాల్టి రోజుల్లో ఆడియో ఫంక్షన్స్ అంటే.. వాటిని హోస్ట్ చేసే వాళ్లు ఎవరు యాంకరింగ్ చేస్తున్నారనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే.. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కు సుమ యాంకరింగ్ కామన్ అయిపోయింది. వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆమెనే కంటిన్యూ చేయాల్సి వస్తోంది. అయితే 'బ్రహ్మోత్సవం' యూనిట్ మాత్రం ఈ విషయంలో డిఫరెంట్ గా చేసింది. రెగ్యులర్ యాంకర్స్ ని కాకుండా.. యంగ్ హీరోతో యాంకరింగ్ చేయించడం విశేషం. హీరో నవదీప్ 'బ్రహ్మోత్సవం' ఆడియో ఈవెంట్ ను హోస్ట్ చేశాడు.

స్టార్టింగ్ లోనే గిలిగింతలు పెట్టేశాడు. నిర్మాత పీవీపీని పట్టుకుని ఎంత ఖర్చు పెట్టారేంటి ఆడియో ఫంక్షన్ కి అంటూ.. క్వశ్చన్ చేయడంతో.. అందరూ స్టన్ అయిపోయారు. ఓ హీరో నోటితో మరో స్టార్ హీరో ఇతర హీరోయిన్లని పొగడ్డం అనే కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయింది. అలాగే ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ప్రతీ మాటకు కొత్తగా అర్ధం చెప్పే ప్రయత్నం చేస్తూ.. నవదీప్ చేసిన కామెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి 'బ్రహ్మోత్సవం' యూనిట్ చేసిన కొత్త ఎటెంప్ట్ కు ప్రశంసలు బానే వస్తున్నాయి.

English summary

Navdeep anchoring in Brahmotsavam audio launch. Young Hero Navdeep acted as a host in Brahmotsavam audio launch.