సాగర తీరాన అలరించిన రిహార్సల్స్

Navy Air force Team Rehearsal In Vizag

02:12 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Navy Air force Team Rehearsal In Vizag

విశాఖ సాగర తీరంలో విశాఖ సముద్ర తీరంలో  ఫిబ్రవరి 4నుంచి ప్రారంభమయ్యే  ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 7వ తేదీన జరగనున్న ప్రధాన విన్యాసాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గడిచిన రెండు రోజుల్లో  ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్ ఆన్ షోర్), ఆఫ్ షోర్ డెమో రిహార్సల్స్ నిర్వహించారు. అయితే  బుధవారం నిర్వహించిన విన్యాసాలకన్నా, గురువారం సాగిన  విన్యాసాలను ప్రజలు మరింత దగ్గరగా వీక్షించారు.అబ్బురపరిచే విధంగా సాగిన విన్యాసాలు తిలకించిన ప్రజలు ఆనంద పరవసులయ్యారు.

ఇక 4వ తేదీ  నుంచి సాగే అసలైన  విన్యాసాలు   ఫిబ్రవరి 7 తో ముగుస్తాయి. చివరి రోజు  ప్రధాని నరేంద్ర మోడీ  హాజరవుతారు.  ఫిబ్రవరి 7వ తేదీన నేవల్ ఆపరేషనల్ డెమో ముగిసిన వెంటనే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రధాని మోడీ  సాయంత్రం 6.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని, ఆయనతోపాటు వచ్చే వివిఐపిలు కూర్చునే వేదికను పూర్తిగా బులెట్ ప్రూఫ్‌తో తయారు చేస్తున్నారు. మొత్తానికి సాగర తీరం కొత్త శోభను సంతరించుకుంది.

1/20 Pages

English summary

International Fleet Review Of Shore Demo Reharshals has been attracted in Vishakapatnam. Many People were came to see that rehearsals at R.K Beach Vishakapatnam . Here are the Photos of Navy day Rehearsals Held At Ramakrishna Beach In Visakhapatnam