పూనే వెళ్ళాల్సిన అమ్మాయి గోవా చెక్కేసింది ?

Navy Officer Daughter Missing

11:35 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Navy Officer Daughter Missing

విశాఖ అమ్మాయి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మిస్సయి న కేసులో మిస్టరీ వీడింది. కైరవి(17) ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ఆ యువతి గోవాకు వెళ్లినట్టు తేలింది. ఆమె ఫోన్ సిగ్నల్ ను పరిశీలించిన పోలీసులు గోవా బీచ్ లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్టు అధికారులు ఆమె తండ్రి విశాఖలో నేవీ ఆఫీసర్ గా పనిచేసే అరవింద్ శర్మకు ఆ విషయాన్ని చెప్పారు. వెంటనే శర్మ బయల్దేరి గోవా వెళ్లగా, అధికారులు అక్కడ ఆమెను అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే, విశాఖ అమ్మాయి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మిస్సయింది. దీంతో కలకలం రేగింది. కైరవి పూణెలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. ఈ మధ్య విశాఖ వచ్చిన యువతి, హైదరాబాద్ మీదుగా తిరిగి పూణె వెళ్లేందుకు (ఈనెల 14న) శంషాబాద్ కు వచ్చింది. అయితే కైరవి పుణెకు చేరలేదన్న విషయం తెలుసుకున్న ఆమె ఫాదర్, కంగారుపడి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆమె ఫోన్ స్విఛ్చాఫ్ అయ్యే ముందు ఏ ప్రాంతంలో ఉందో గుర్తించేందుకు విచారణ చేపట్టారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. దీంతో అమ్మాయి ఆచూకి దొరికేసింది. హైదరాబాద్ కు వచ్చిన తర్వాతగానీ ఆమె ఎందుకు గోవా వెళ్లిందో తెలియదు. కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చూడండి: జెంటిల్‌మన్‌ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

English summary

Navy Officer Daughter Missing. Her name Kairavi Sharma, daughter of a senior Naval officer.