పఠాన్‌కోట్‌ ఉగ్రసంస్ధ పై చర్యలు 

Nawaz Sharif Phone To Modi

10:05 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Nawaz Sharif Phone To Modi

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్ లోకి అక్రమంగా చొరబడి భారత సైనికుల పై దాడులు చేసిన ఉగ్రవాదులు. ఆ దాడులకు పాల్పడింది తామేనని యునైటెడ్‌ జీహాది కౌన్సిల్‌ (యూజేసి) నిన్న ప్రకటించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా యూజేసి సంస్ధ ప్రతినిధి సయ్యాద్‌ సదాకత్‌ ప్రకటించుకున్నాడు. ఈ దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌లో ఆశ్రమం పొందుతున్న ఉగ్రవాది సంస్ధ అని బట్టబయలు కావడంతో పాకిస్ధాన్‌ దేశ అధ్యక్షుడు నవాబ్‌ షరీష్‌ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కు ఫోన్‌ చేసి మాట్లాడారు. పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస & పై దాడి చేసిన ఉగ్రవాదుల సంస్ధ పై చర్యలకు భారత్‌ కు పూర్తిగా సహాకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్‌ లో ఉగ్రవాదులతో భారత ఆర్మీ దాదాపు 80 గంటల పాటు పోరాడారు. ఉగ్రవాదులకు, భారత్‌ భద్రతా దళాలకు జరిగిన కాల్పుల్లో ఏడుగురు భారత సైనికులు మృతి చెందగా, ఇంకా కొంతమంది సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. భారత సైనికులు ఉగ్రవాలను సమర్ధవంతంగా ఎదుర్కోని ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు.


English summary

Pakisthan President Nawaz Sharif Phones To Indian Prime Minister Narendra Modi Yesterday. Nawaz sharif gave oath that pakistasn government will give support in the action against Terrorists