చిన్నప్పుడే తేళ్లు, పాములతో ఆడుకున్న నయీమ్!

Naxalite Nayeem childhood details

12:34 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Naxalite Nayeem childhood details

నక్సలైట్ల ఆనుపానులు తెలుసుకొని వాళ్లకే ఎసరుపెట్టాడు. తర్వాత పోలీసులకు కోవర్టుగా మారి వాళ్ల పేరును ఉపయోగించుకొని చెలరేగిపోయాడు. చివరకు ఆపరేషన్ నయీంతో హతమైపోయాడు. చిన్నప్పటినుంచి విచిత్ర స్వభావం గల నయీమ్ బాల్యంలో తేళ్లు, పాములతో ఆటలు ఆడుకునే వాడట. ఒకసారి నయీమ్ గురించి వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమొద్దీన్ ది చిన్నప్పటినుంచి విచిత్ర స్వభావమని అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు. బాల్యంలోనే తేళ్లు, పాములతో ఆడుకునేవాడంటున్నారు. నయీం తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది.

1/4 Pages

ఎస్ఎఫ్ఐ నుంచి రాడికల్ గా...


విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పనిచేసిన నయీమ్, ఆతర్వాత రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో చేరి క్రియాశీలకంగా పనిచేశాడు. 1985లోనే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాటు తుపాకీతో హల్ చల్ చేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో నయీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary

Naxalite Nayeem childhood details