అధికారులను తిట్టిపోసిన నయనతార

Nayanatara angry over officials

06:55 PM ON 13th February, 2017 By Mirchi Vilas

Nayanatara angry over officials

ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులకు అందాల తార నయనతార క్లాస్ పీకింది. ఇంకా చెప్పాలంటే గట్టిగానే తిట్టిపోసిందట. ఇంతకీ నయనతార అధికారులను ఎడా పెడా తిడుతూ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది? ఒకవేళ రాజకీయాల్లోకి వస్తోందా? అసలు దీనివెనుక అసలు కారణంలోకి వెళ్తే, తమిళంలో తాగు నీటి సమస్యల నేపథ్యంగా తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార కలెక్టర్ గా నటిస్తోందట. ఈ క్రమంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరించే అధికారులపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సందర్భంగా అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. నయనతార నటిస్తున్న చిత్రం తమిళనాడులోని పరమకుడి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాకు నయనతార ఏకధాటిగా 50 కాల్షీట్లు కేటాయించిందట. నయనతార నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. అదండీ అసలు సంగతి

ఇది కూడా చూడండి: రేచీకటి, కీళ్ల నొప్పులు తగ్గించే దివ్యౌషధం ఇదే..!

ఇది కూడా చూడండి: సంతానం పొందాలంటే ఇవి తినాల్సిందే...

English summary

Tollywood actress Nayanatara got angry on officials for their negligence over public.